1990s Food Prices: 90ల కాలంలో బియ్యం, పప్పులు వంటి సరుకుల కిలో ధరలు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు

Published : Oct 24, 2026, 08:10 AM IST

1990s Food Prices: ప్రస్తుతం ఒక మిడిల్ క్లాస్ ఇల్లు నెలమొత్తం ఖర్చులు వేలల్లో పెరిగిపోయాయి. ఏది తీసుకున్న కిలో వందకు పైగా ఉంటోంది. కానీ 30 ఏళ్ల క్రితం పరిస్థితి అలా లేదు. 90స్ కాలంలో జీతాలు తక్కువే అయినా..ఖర్చులు చాలా మితంగా ఉండేవి.

PREV
14
30 ఏళ్ల క్రితం ఖర్చులు

కాలం మారుతున్న కొద్దీ సాంకేతికత అభివృద్ధి చెందుతోంది, మనుషుల లైఫ్ స్టైల్ తో పాటు ఆదాయం, ఖర్చులు కూడా మారుతున్నాయి. వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేడు ఒక మధ్యతరగతి కుటుంబం నెలవారీ ఖర్చుల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కానీ సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం, అంటే 1990లలో పరిస్థితి పూర్తిగావేరేలా ఉండేది. అప్పట్లో రూపాయికి ఎంతో విలువ ఉండేది. మరి నాటి కాలంలో జీతాలు ఎలా ఉండేవి? నిత్యవసర సరుకుల ధరలు ఏ విధంగా లభించేవి? ఒకసారి ఆ రోజులను గుర్తు చేసుకుందాం.

24
1990 లో జీతాలు - సంపాదన

1990లలో నేటితో పోలిస్తే జీతాలు చాలా తక్కువగా ఉండేవి. ఒక ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగం సంపాదిస్తే నెలకు సుమారు వెయ్యి నుంచి మూడు వేల రూపాయల మధ్య జీతం వచ్చేది. చిన్నతరహా ఉద్యోగులు, కూలీల రోజువారీ సంపాదన పది నుంచి ముప్పై రూపాయల లోపే ఉండేది. అయినప్పటికీ, ఆ రోజుల్లో ఆ సంపాదనతోనే కుటుంబాలు ఎంతో సంతోషంగా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సర్దుకుపోయేవి. అప్పట్లో డొమిస్టిక్ సేవింగ్స్ (పొదుపు చేసే అలవాటు) చాలా ఎక్కువగా ఉండేది.

బియ్యం, పప్పులు తో పాటు కిరాణా ధరలు

ఆ కాలంలో కిరాణా సామగ్రి ధరలు అత్యంత అందుబాటులో ఉండేవి. నాణ్యమైన బియ్యం కిలో కేవలం రూ. 4 నుంచి రూ. 8 లోపు) దొరికేవి. రేషన్ దుకాణాల్లో ఇంకా తక్కువ ధరకే లభించేవి.

కందిపప్పు, మినపప్పు వంటి పప్పుల ధరలు కిలోకి రూ. 10 నుంచి రూ. 15 మించేవి కావు. వంట నూనెలు, చింతపండు, కారం పొడి వంటి ఇతర సరుకులు కూడా చాలా తక్కువ బడ్జెట్‌లో వచ్చేవి.

34
90s పాత లిస్ట్ లో ఏముంది?

1990 లో ఖర్చులు ఎలా ఉండేవనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. రీసెంట్ గా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డైరీలో రాసుకున్న ఓ సరుకుల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో రాసుకున్న విధంగా నెల జీతంతో పాటు చిన్న చిన్న ఖర్చుకలు కూడా స్పస్టంగా రాసుకున్నారు. దాని ప్రకారం అప్పట్లో రేట్లు ఎలా ఉండేవంటే?

12-11-1990 – జీతం, ఖర్చుల వివరాలు

ఆదాయ వివరాలు:

  • జీతం (గ్రామ పంచాయితీ కార్యాలయం ఉద్యోగం): ₹1,250.00
  • ఇంటి అద్దె (ఆదాయం): ₹200.00
  • ఇతర ఆదాయం (పాల అమ్మకం): ₹150.00
  • మొత్తం ఆదాయం: ₹1,600.00

మార్కెట్ ఖర్చులు 

  • బియ్యం (1 kg): ₹8.00
  • కంది పప్పు (1 kg): ₹14.00
  • మినప్పప్పు (500 g): ₹7.50
  • నూనె (1 లీటర్): ₹20.00
  • ఉల్లిపాయలు (1 kg): ₹3.00
  • టమాటాలు (1 kg): ₹4.00
  • బంగాళాదుంపలు (1 kg): ₹2.00
  • మిరపకాయలు (250 g): ₹3.00
  • పసుపు (100 g): ₹1.50
  • కొత్తిమీర, కరివేపాకు: ₹1.00
  • పాలు (సాయంత్రం - 1 లీటర్): ₹4.00
  • సబ్బు (1): ₹3.00
  • కిరోసీన్ (2 లీటర్లు): ₹8.00
  • బస్ ఛార్జీలు (నలుగురికి): ₹4.00
  • చిల్లర ఖర్చులు (పేపర్, ఉప్పు వంటివి): ₹6.50
  • మొత్తం ఖర్చు: దాదాపుగా ₹100
44
కూరగాయలు - ఇతర ఖర్చులు:

కూరగాయల మార్కెట్‌కు వెళ్తే రూ. 10 లేదా రూ. 20 పట్టుకెళితే ఒక పెద్ద సంచి నిండా కూరగాయలు వచ్చేవి. టమాటాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు కేవలం రూపాయి లేక రెండు రూపాయల కిలో చొప్పున లభించేవి. కిరోసిన్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు కూడా చాలా తక్కువగా ఉండటంతో ఇంధన భారం పెద్దగా ఉండేది కాదు. పిల్లల చదువులు, బస్సులు లేదా ట్రైన్ ప్రయాణ ఖర్చులు కూడా చాలా నామమాత్రంగానే ఉండేవి. నేటి ఆధునిక కాలంతో పోల్చుకుంటే 1990లలో జీతాలు తక్కువే అయినప్పటికీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో అణగిపోయి ఉండేవి. అప్పట్లో మానవ సంబంధాలు, పొరుగువారితో అనుబంధాలు ఆర్థిక పరిస్థితులకంటే ఎంతో ఉన్నతంగా ఉండేవి. ఈ రోజులతో పోలిస్తే ఆ కాలం ఒక ఎప్పటికీ మరువలేని తీపి జ్ఞాపకంలా అనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories