YouTube Income : 500M సబ్‌స్క్రైబర్స్, ఏటా రూ.800 కోట్ల ఇన్కమ్.. ఈ టాప్ యూట్యూబర్ ఎవరో తెలుసా?

Published : Sep 24, 2026, 11:34 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద యూట్యూబర్లలో మిస్టర్ బీస్ట్ ఒకరు. ఆయన సంపాదన చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఆయన నెలకు ఎంత సంపాదిస్తారు? ఆయనలా యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

PREV
14
యూట్యూబ్ టిప్స్

ఈ రోజుల్లో యూట్యూబ్ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాదు, చాలా మందికి ఇది ఒక పెద్ద ఆదాయ వనరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూట్యూబర్లు వీడియోల ద్వారా లక్షలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ ఈ యూట్యూబ్ ఫీల్డ్‌లో మిస్టర్ బీస్ట్ పేరు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఆయన అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్. 2026 జూన్ నాటికి ఆయన యూట్యూబ్ ఛానెల్ 500 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను దాటేసింది. మరి మిస్టర్ బీస్ట్ నెలకు ఎంత సంపాదిస్తారు? ఆయనలా పెద్ద యూట్యూబర్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం.

24
మిస్టర్ బీస్ట్ నెలకు ఎంత సంపాదిస్తారు?

మిస్టర్ బీస్ట్‌కు నెలవారీ ఫిక్స్డ్ జీతం అంటూ ఏమీ ఉండదు. యూట్యూబ్, బ్రాండ్స్, బిజినెస్, ఇతర ప్రాజెక్టుల నుంచి ఆయనకు ఆదాయం వస్తుంది. ఫోర్బ్స్ 2025 టాప్ క్రియేటర్స్ రిపోర్ట్ ప్రకారం.. మిస్టర్ బీస్ట్ వార్షిక ఆదాయం సుమారు $85 మిలియన్లు అంటే రూ.800 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. దీన్ని 12 నెలలకు లెక్కిస్తే నెలకు సుమారు $7.1 మిలియన్లు వస్తుంది. 2026 సెప్టెంబర్ 22 నాటికి డాలర్ విలువ 95.8 రూపాయల చొప్పున చూసుకుంటే, ఇది నెలకు సగటున ₹68 కోట్లతో సమానం. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే, ఆయన కచ్చితమైన నెలవారీ సంపాదన కాదు.

అయితే మిస్టర్ బీస్ట్‌కు కేవలం యూట్యూబ్ యాడ్స్ ద్వారా మాత్రమే డబ్బులు రావు. ఆయన తన వీడియోలతో పాటు పలు వ్యాపారాలు, బ్రాండ్లతో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన కంపెనీలో ఫీస్ట్‌టేబుల్స్ (Feastables) లాంటి ఇతర బిజినెస్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆయన మళ్లీ కంటెంట్, బిజినెస్ కోసమే పెట్టుబడిగా పెడతారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కాబట్టి ఆయన సంపాదించిన డబ్బంతా బ్యాంక్ అకౌంట్‌లోనే ఉంటుందని చెప్పలేం.

34
మిస్టర్ బీస్ట్ లా పెద్ద యూట్యూబర్ అవ్వాలంటే ఏం చేయాలి?

మీరు కూడా ఒక పెద్ద యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనుకుంటే, మొదట్లోనే ఖరీదైన కెమెరాలు, పెద్ద సెటప్ అవసరం లేదు. ముందుగా మీరు రెగ్యులర్‌గా వీడియోలు చేయగలిగే ఒక మంచి టాపిక్ ఎంచుకోండి. జనాలు మీ వీడియో ఎందుకు చూడాలో ఒక కారణం వెతకండి. దానికి తగ్గట్లుగా వీడియోలను కాస్త క్రియేటివ్ గా రూపొందిస్తే చాలు సక్సెస్ అవ్వొచ్చు.

మిస్టర్ బీస్ట్ చెప్పే సక్సెస్ సీక్రెట్ ఏంటంటే.. మొదటి వీడియోతోనే అద్భుతాలు ఆశించకండి. కంటిన్యూగా వీడియోలు చేస్తూ ఉండండి. ప్రతి వీడియోలో కనీసం ఒక్క చిన్న తప్పునైనా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లండి. రోజులు గడిచేకొద్దీ మీ కంటెంట్ క్వాలిటీ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.

44
ప్రతి వీడియోలో కొత్తదనం ట్రై చేయండి

యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియో అప్‌లోడ్ చేస్తే సరిపోదు. జనాలు దానిపై క్లిక్ చేసి, పూర్తిగా చూసేలా మీరు ఒక రీజన్ ఇవ్వాలి. అందుకే వీడియో టాపిక్, ఇంట్రో, థంబ్‌నెయిల్, టైటిల్ చాలా ముఖ్యం. మిస్టర్ బీస్ట్ కంటెంట్‌లో సాహసోపేతమైన ఛాలెంజ్‌లు, కొత్త ఐడియాలు, జనాల్లో క్యూరియాసిటీ పెంచే అంశాలు ఉంటాయి. మీరు కూడా చిన్నగా మొదలుపెట్టొచ్చు. ఒక సాధారణ విషయాన్ని కొత్తగా చెప్పడం, ఒక కథలా మార్చడం లేదా మీ వీడియోలో ఒక చిన్న ఛాలెంజ్ యాడ్ చేయడం లాంటివి ట్రై చేయండి.

కొత్త ఛానెల్ పెట్టిన వెంటనే మొదటి వీడియోకే లక్షల్లో వ్యూస్ రావాలని రూల్ లేదు. స్టార్టింగ్‌లో మీ వీడియోలను తక్కువ మంది చూసినా సరే, ప్రతి వీడియో నుంచి కొత్త విషయాలు నేర్చుకోండి. అది మీ తర్వాతి వీడియోను మరింత బాగా చేయడానికి హెల్ప్ అవుతుంది. మంచి కంటెంట్, రెగ్యులర్‌గా వీడియోలు పెట్టడం, సూపర్ ఎడిటింగ్, ఆడియన్స్‌కు ఏం కావాలో అర్థం చేసుకోవడం.. ఇవే మీ ఛానెల్‌ను క్రమంగా పెంచుతాయి. కాబట్టి మీరు పెద్ద యూట్యూబర్ అవ్వాలని కలలు కంటుంటే, కేవలం డబ్బు సంపాదించడం పైనే కాకుండా జనాలు ఇష్టపడి చూసే, షేర్ చేసే కంటెంట్ క్రియేట్ చేయడంపై ఫోకస్ పెట్టండి.

Read more Photos on
click me!

Recommended Stories