Most Costly Cow: అంబానీ మాత్రమే కొనగలిగే ఆవు ఇది.. దీని ధర తెలిస్తే అవాక్కవుతారు

Published : Aug 30, 2026, 03:09 PM IST

Most Costly Cow: సాధారణంగా ఆవుల ధర వేలల్లో ఉంటుంది. కానీ ఓ ఆవు విలువ ఏకంగా 35 కోట్ల రూపాయలు. ఈ ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సృష్టించింది. దీని స్పెషాలిటీ ఏంటె తెలుసుకోండి.

PREV
13
ప్రపంచంలోనే ఖరీదైన ఆవు

సాధారణంగా ఆవుల ధరలు వేలల్లోనే ఉంటాయి. కానీ ప్రపంచంలోనే ఒక ఆవు ధర ఏకంగా కోట్లలో ఉంది. దాన్ని కొనాలంటే కేవలం అంబానీ, అదానీ, మస్క్.. వంటి బిలియనీర్ల వల్లే అవుతుంది. ఆ ఆవు బ్రెజిల్‌కు చెందిన 'వియాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవిస్' (Viatina-19 FIV Mara Imóveis) ఆవరు. ఇది నెలోర్ జాతి ఆవు. దీని విలువ ఏకంగా 35 కోట్ల రూపాయలు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది.

ఇది ఎందుకింత ఖరీదు అనే అనుమానంలో ఎక్కువమందిలో కలుగుతుంది. ఆ ఆవు పరిమాణం లేదా రూపం కొంచెం భిన్నంగా ఉంటుంది. అలాగే అరుదైన జన్యు లక్షణాలు, అద్భుతమైన పునరుత్పత్తి సామర్థ్యం, వేడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వంటివి దీనికి ఉన్నాయి. సుమారు నాలుగన్నర ఏళ్ల వయసున్న ఈ వియాటినా-19 ఆవు బ్రెజిల్‌లోని అరాండులో జరిగిన వేలంలో ఏకంగా కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. భారతీయ కరెన్సీ ప్రాకారం దీని ఖరీదు 35 కోట్ల రూపాయలకు వరకు ఉంటుంది.

23
దీని ఆకారం ప్రత్యేకం

ఈ ఆవు చూసేందుకు చాలా కొత్తగా ఉంటుంది. బ్రెజిల్‌లో అత్యంత ముఖ్యమైన పశువుల జాతుల్లో ఒకటి. ఈ జాతి ఆవులు సాధారణంగా తెల్లగా లేదా లేత రంగు చర్మంతో, భుజాలపై పెద్ద మూపురంతో, వదులుగా ఉండే చర్మంతో ఉంటాయి. ఇవి ఎంత వేడి వాతావరణాన్ని అయిన తట్టుకుంటాయి.

కొన్ని యూరోపియన్ జాతులతో పోలిస్తే నెలోర్ ఆవులకు చెమట గ్రంథులు పెద్దవిగా, ఎక్కువగా ఉంటాయి. ఇది వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. వాటి మందపాటి చర్మం కీటకాలు, పరాన్నజీవుల నుండి రక్షణ కల్పిస్తుంది. అందుకే ఉష్ణమండల పరిస్థితులకు నెలోర్ జాతి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

33
నెల్లూరుతో అనుబంధం ఉందా?

ఈ నెలోర్ జాతి ఆవులకు నెల్లూరు అనుబంధం ఉంది. 'నెలోర్' అనే పేరు మన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నుండి వచ్చింది. ఈ జాతి పూర్వీకాలను భారతదేశం నుండే బ్రెజిల్‌కు తీసుకెళ్లారని నమ్ముతారు. ఈ రోజు నెలోర్ జాతి బ్రెజిల్‌లో ప్రధాన మాంసం జాతులలో ఒకటిగా నిలిచింది.

వియాటినా-19 ఆవు ధర ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు భారతదేశం నుండి బ్రెజిల్‌కు వెళ్లిన ఒక జాతి, ఈ రోజు 35 కోట్ల రూపాయల విలువైన ఆవుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం నిజంగా ఆసక్తికరమైన విషయం.

Read more Photos on
click me!

Recommended Stories