Success Story:చేయాలనే తపన ఉంటే వయసుతో పనేంటి..? 65ఏళ్ల వయసులో ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి కథ ఇది..!

Published : Jul 25, 2026, 01:56 PM IST

Success Story: 60ఏళ్లు దాటితే చాలు రిటైర్మెంట్ వయసు వచ్చేసిందని.. ఎలాంటి పని చేయకుండా రెస్ట్ తీసుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ, ఒక వ్యక్తి లైఫ్ లో సక్సెస్ 65 ఏళ్ల తర్వాత మొదలైంది..

PREV
14
విజయానికి వయసుతో పనేంటి..? సక్సెస్ స్టోరీ..

లైఫ్ లో ఏదైనా సాధించాలన్నా,సక్సెస్ అవ్వాలన్నా 30 ఏళ్లలోపే జరిగిపోవాలి అనే నమ్మకం మనలో చాలా మందికి ఉంటుంది. ఇక వయసు 60 దాటింది అంటే.. పని చేసినా , చేయకపోయినా అది రెస్ట్ తీసుకునే సమయం లా భావిస్తారు. అప్పటి నుంచి.. ఇంట్లోనే ఉంటూ.. పిల్లలు, మనవళ్లతో సమయం గడుపుతూ.. కాలక్షేపం చేస్తూ ఉంటారు. 30 దాటిన వ్యక్తి జీవితంలో ఏదీ సాధించలేదు అంటే.. అతను ఎందుకూ పనికిరాడు అనే భావన కూడా మనలో చాలా మందికి ఉంటుంది. కానీ.. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కష్టపడేతత్వం, చేయాలనే తపన ఉంటే.. ఏ వయసులో అయినా సాధించొచ్చు అని నిరూపించాడు ఓ వ్యక్తి. 65 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని మార్చిన ఓ వ్యక్తి కథ ఇప్పుడు తెలుసుకుందాం...

24
KFC కథ తెలుసా?

చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరికీ ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ లో KFC ముందు వరసలో ఉంటుంది. ఇదంటే ఇష్టం లేనివాళ్లు ఎవరూ ఉండరు. దీని వ్యవస్థాపకుల్లో కల్నల్ హార్లాండ్ సాండర్స్ కూడా ఒకరు. రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన వయసులో సాండర్స్ తన జీవితంలోనే అతి పెద్ద ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ ప్రయాణమే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా KFC రెస్టారెంట్లకు పునాదిగా మారింది.

34
సాండర్స్ బాల్యం ఎలా సాగిందంటే..

హార్లాండ్ సాండర్స్ 1980లో అమెరికాలో జన్మించారు. చిన్న వయసులోనే అతను తండ్రిని కోల్పోయారు. కుటుంబ బాధ్యతల వల్ల చిన్నతనం నుంచే వంట చేయడం నేర్చుకున్నారు. కుటుంబాన్ని పోషించడానికి ఆయన చేయని ఉద్యోగం అంటూ లేదు. వ్యవసాయం చేశాడు.. ట్రామ్ కండక్టర్ గా, రైల్వే ఉద్యోగి గా, ఇన్సూరెన్స్ సేల్స్ మ్యాన్, పెట్రోల్ బంక్ నిర్వాహకుడుగా ఆయన చాలా రకాల పనులు చేశాడు. ఏ పని చేసినా.. కోరకున్న విజయం సాధించలేకపోయాడు. చివరికే, చికెన్ రుచి ఆయన జీవితాన్ని మార్చింది.

కెంటకీ రాష్ట్రంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద ప్రయాణికులకు స్వయంగా తయారు చేసిన ఫ్రైడ్ చికెన్ అమ్మడం మొదలుపెట్టాడు. ఆ రుచి అందరికీ నచ్చడం మొదలుపెట్టింది. ఫ్రై చేసిన చికెన్ అందరూ అమ్ముతారు. కానీ, ఈయన ప్రత్యేక మసాలాల మిశ్రమంతో తయారు చేయడం వల్ల దానికి ఆ రుచి వచ్చింది. అందరికీ నచ్చడంతో వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఆయన దాదాపు 11 సీక్రెట్ మసాలాలతో కలిసి ఈ ఫ్రైడ్ చికెన్ తయారు చేశారు.

44
65ఏళ్ల వయసులో మారిన జీవితం...

ఈ ఫ్రైడ్ చికెన్ వ్యాపారం సక్సెస్ అయిన సమయంలో ఆయన వయసు 65ఏళ్లు కావడం విశేషం. తన చికెన్ రెసిపీని దేశమంతా తీసుకువెళ్లాలని అనుకున్నాడు. మొదట తన కారులో తయారు చేసిన చికెన్ తీసుకొని అమెరికా అంతా తిరుగుతూ రెస్టారెంట్ల యజమానులను కలిసేవారు.‘ నా రెసిపీ ఉపయోగించి చికెన్ అమ్మండి. అమ్ముడైన ప్రతి చికెన్ పై నాకు కొంత వాటా ఇవ్వండి’ అని అడిగేవారు. చాలా రెస్టారెంట్లు తిరస్కరించారు. దాదాపు వెయ్యికి పైగా రెస్టారెంట్లు ఆయన ఆఫర్ ని తిరస్కరించాయి. కానీ... ఈ వయసులో నాకెందుకులే అని అనుకోకుండా.. తన ప్రయత్నం ఆపలేదు. చివరకు ఆయన ప్రయత్నానికి ఫలితం లభించింది. కొన్ని రెస్టారెంట్లు ఆయన ప్రతిపాదను ఒకే చెప్పాయి. ఆ విధంగా, KFC మొదలైంది. కొద్ది సంవత్సరాల్లోనే ఈ పేరుతో చాలా ఫ్రాంచైజీలు మొదలుపెట్టారు.ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా KFC బ్రాంచులు ఉన్నాయి.

ఆయన కథ మనకు ఏం చెబుతోంది..?

హార్లాండ్ సాండర్స్ జీవితం మనకు ఎన్నో పాఠాలు చెబుతుంది. విజయం సాధించడానికి వయసు ఒక అడ్డు కాదు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన.. లైఫ్ ఆగిపోదు. తిరిగి ప్రయత్నిస్తే.. కచ్చితంగా విజయం సాధిస్తారు. కొత్త ఆలోచన, పట్టుదల, నిరంతర ప్రయత్నం ఉంటే ఏ వయసులో అయినా ఏదైనా సాధించొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories