Cheapest Petrol: అక్కడ లీటర్ పెట్రోల్ చాలా చీప్, 3 రూపాయలు కూడా ఉండదు .. ఎక్కడో తెలుసా?

Published : Aug 09, 2026, 08:50 AM IST

Cheapest Petrol: మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని దేశాల్లో మాత్రం పెట్రోల్ చాలా చవకగా ఉంటుంది. ఎంతగా అంటే కనీసం మూడు రూపాయలు కూడా ఉండదు. ఆ దేశాల గురించి ఇక్కడ ఇచ్చాము.

PREV
13
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు

మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. కేంద్ర పన్నులతో పాటు రాష్ట్రాల పన్నులు, స్థానిక ఛార్జీల వల్ల ధరల్లో తేడా ఉంటుంది. ఇండియన్ ఆయిల్ ప్రకారం రోజువారీ ధరలు సాధారణంగా ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మనదేశంలో లీటర్ 102 రూపాయల నుంచి 115 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇరాన్ యుద్ధం వల్ల ఈ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ ఒక దేశంలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలు కూడా లేదు. ఆ దేశం ఏదో తెలుసా?

23
ఇరాన్

ఇరాన్‌లో పెట్రోల్ చాలా చౌకగా లభిస్తుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర కేవలం ఒక రూపాయి నుంచి మూడు రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. ఇరాన్‌లో భారీగా చమురు నిల్వలు ఉండటం, ప్రభుత్వం పెట్రోల్‌పై పెద్ద మొత్తంలో రాయితీ ఇవ్వడం వల్ల ధర ఇలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ రాయితీల వల్ల ఇంధన వినియోగం, అక్రమ రవాణా కూడా పెరుగుతున్నాయి.

33
వెనెజులా

వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.70గా ఉంది. వెనెజులాలో పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఆ దేశంలో భారీగా చమురు నిల్వలు ఉన్నాయి. వెనెజులా ప్రపంచంలోనే అతిపెద్ద నిర్ధారిత చమురు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి. అక్కడ ప్రభుత్వం పెట్రోల్‌పై భారీ సబ్సిడీలు ఇస్తుంది. అంటే పెట్రోల్ తయారీ, పంపిణీకి అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అందుకే ప్రజలకు తక్కువ ధరకు ఇంధనం అందుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories