Mumbai Facts: అక్కడ రాత్రి 8 తర్వాతే వ్యాపారాలు మొదలవుతాయి..కారణమేంటో తెలుసా?

Published : Jun 27, 2026, 06:37 PM IST

Mumbai Facts: భారతదేశంలో మెట్రో నగరాల జీవనశైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మాత్రం ఎప్పుడూ ఒక వింత జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మే, జూన్ నెలలో. అదెంటో తెలుసా

PREV
15
ఆలస్యంగా చీకటి పడటానికి గల కారణాలేంటో తెలుసా?

దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 లేదా 6.30 గంటలకే చీకటి పడిపోతుంటే, ముంబయిలో మాత్రం రాత్రి 7.45 లేదా 8 గంటల వరకు కూడా వెలుతురుగానే ఉంటుంది. చీకటి పడదు. రాత్రి ఎనిమిది గంటలకు కూడా అక్కడ సాయంత్రం ఐదు గంటల వాతావరణమే కనిపిస్తుంది. అసలు ముంబయిలో ఇంత ఆలస్యంగా చీకటి పడటానికి గల కారణాలేంటో తెలుసా? 

25
1. ఒకే టైమ్ జోన్ (IST) ఎఫెక్ట్

భారతదేశం తూర్పున అరుణాచల్ ప్రదేశ్ నుండి పడమరన గుజరాత్ వరకు దాదాపు 3వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సాధారణంగా ఇంత పెద్ద విస్తీర్ణం ఉన్నప్పుడు రష్యా లేదా అమెరికా లాగా ఒకటి కంటే ఎక్కువ టైమ్ జోన్లు (Time Zones) ఉండాలి. కానీ, భారతదేశం మొత్తానికి ఒకే ఒక టైమ్ జోన్ ఉంది. అదే Indian Standard Time (IST). దీనిని దేశం మధ్యలో ఉన్న అలహాబాద్ (మీర్జాపూర్) రేఖాంశం ఆధారంగా లెక్కించారు. 

35
భూగోళ శాస్త్ర నియమాల ప్రకారం..

తూర్పున ఉన్న అస్సాం, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో సూర్యుడు చాలా త్వరగా ఉదయించి, అంతే త్వరగా సాయంత్రం ఐదున్నరకే అస్తమిస్తాడు. అయితే ముంబయి నగరం భారతదేశానికి పశ్చిమ తీరం చివరన ఉంది. అలహాబాద్ ప్రామాణిక సమయం కంటే ముంబయి భౌగోళికంగా దాదాపు 45 నిమిషాలు వెనుకబడి ఉంటుంది. దీనివల్ల మన వాచ్‌లలో సమయం అందరికీ ఒకేలా చూపిస్తున్నప్పటికీ, ముంబయిలో సూర్యాస్తమయం కావడానికి దేశంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది.

45
2. వేసవి కాలం, 'ట్విలైట్' (Twilight) ప్రభావం

భూమి తన అక్షంపై 23.5 డిగ్రీలు వంగి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. వేసవి కాలంలో ఉత్తర అర్ధగోళం సూర్యుడి వైపు వంగి ఉన్నప్పుడు పగటి సమయం పెరుగుతుంది. ముంబయిలో వేసవిలో సూర్యుడు సాయంత్రం 7:15 నుండి 7:20 గంటల మధ్య అస్తమిస్తాడు.

55
ట్విలైట్ కాంతి

సూర్యుడు Horizon కిందకు వెళ్లిపోయినప్పటికీ, వాతావరణంలోని పైపొరల వల్ల సూర్యకిరణాలు పరావర్తనం (Reflection) చెంది భూమిపైకి వస్తాయి. దీనినే 'ట్విలైట్' లేదా సంధ్యా వెలుతురు అంటారు. ముంబయి సముద్ర తీరంలో ఉండటం వల్ల ఈ ట్విలైట్ ప్రభావం చాలా స్పష్టంగా, ఎక్కువసేపు ఉంటుంది. సూర్యుడు అస్తమించాక కూడా ఈ వెలుతురు మరో 35 నుండి 40 నిమిషాల పాటు ఉంటుంది. దీంతో వాచ్‌లో రాత్రి 8 గంటలైనా ఆకాశం నీలం, నారింజ రంగుల కలయికతో వెలుతురుగానే కనిపిస్తుంది.

ఇదే కారణం వల్ల ముంబయిలో ఉదయం సూర్యోదయం కూడా ఆలస్యంగా ఉదయం 6 లేదా 6.15 కి అవుతుంది. తూర్పు రాష్ట్రాల ప్రజలు రాత్రి 8 గంటలకల్లా డిన్నర్ ముగించి పడుకోవడానికి సిద్ధమవుతుంటే, ముంబయి వాసులకు మాత్రం అప్పుడే సాయంత్రం కావడం వల్ల వారి నైట్ లైఫ్, బిజినెస్ అవర్స్ చాలా ఆలస్యంగా మొదలవుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే, ఇదంతా ప్రకృతి సృష్టించిన భౌగోళిక వింత, మన దేశం అనుసరిస్తున్న ఒకే ఒక్క టైమ్ జోన్ విధానం వల్ల జరుగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories