RBI New Checkbook Rules: 1 జనవరి నుంచి కొత్త చెక్‌బుక్ రూల్స్? ఆర్బీఐ కీలక ప్రకటన !

Published : Nov 09, 2026, 04:03 PM IST

RBI New Checkbook Rules Fact Check: సోషల్ మీడియాలో 1 జనవరి 2027 నుంచి చెక్‌బుక్ రూల్స్ మారుతాయంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే చెక్ బుక్ రూల్స్ మారబోతున్నాయా? ఆర్బీఐ ఏం చెప్పింది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
కొత్త చెక్‌బుక్ రూల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్

గత కొన్ని రోజులుగా వాట్సాప్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 1 జనవరి 2027 నుంచి చెక్‌బుక్ నిబంధనలలో పెద్ద మార్పులు చేయబోతోందని ఆ మెసేజ్‌లో ప్రచారం జరుగుతోంది. 31 డిసెంబర్ 2026 తర్వాత ప్రస్తుతమున్న చెక్‌బుక్‌ల స్థానంలో కొత్త సెక్యూరిటీ ఫీచర్లు ఉన్న చెక్‌బుక్‌లను ఉపయోగించాలని అందులో పేర్కొన్నారు. ఇలాంటి మెసేజ్‌లు మీ ఫోన్‌కి కూడా వచ్చి ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి.

25
కొత్త చెక్ బుక్ రూల్స్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై ప్రభుత్వ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పందించింది. ఎక్స్ లో ఒక పోస్ట్ విడుదల చేస్తూ, ఈ వైరల్ వార్త పూర్తిగా అవాస్తవం అని తేల్చిచెప్పింది. 1 జనవరి 2027 నుంచి చెక్‌బుక్ కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ ఫేక్ మెసేజ్‌లను సర్క్యులేట్ చేస్తున్నారని హెచ్చరించింది.

35
ఆర్బీఐ క్లారిటీ: నవంబర్ 7న అధికారిక ప్రకటన

ఈ అంశంపై నవంబర్ 7వ తేదీన ఆర్బీఐ స్వయంగా స్పందించింది. ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేస్తూ ఈ వైరల్ మెసేజ్‌లను తప్పుదారి పట్టించేవిగా అభివర్ణించింది. ప్రస్తుతానికి చెక్‌బుక్ మార్పులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర బ్యాంకు తేల్చిచెప్పింది. బ్యాంకింగ్ అంశాలకు సంబంధించి ఎప్పుడైనా సరే కేవలం ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

45
అసలు చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటే ఏమిటి?

చాలా మందికి సీటీఎస్ (CTS) గురించి సందేహాలు ఉంటాయి. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అనేది చెక్ క్లియరింగ్ చేయడానికి ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ విధానం. దీని ద్వారా చెక్‌లను భౌతికంగా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బదులుగా, చెక్ ఇమేజ్, దానికి సంబంధించిన వివరాలను డిజిటల్ పద్ధతిలో పంపిస్తారు. దీనివల్ల పని వేగంగా జరుగుతుంది. సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ సిస్టమ్‌లో ఎలాంటి మార్పులు లేవు.

55
ప్రజలకు కీలక సూచనలు

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్‌ను గుడ్డిగా నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక విషయాలు, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకుకు సంబంధించిన రూల్స్ గురించి ఎటువంటి అప్‌డేట్ వచ్చినా ఆర్బీఐ అధికారిక సైట్ ద్వారానే తెలుసుకోవాలి. ఫేక్ వార్తలను ఇతరులకు షేర్ చేసి భయభ్రాంతులకు గురిచేయవద్దని అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న పాత చెక్‌బుక్‌లు ఎప్పటిలాగే ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories