Fact Check: పాకిస్థాన్ పార్ల‌మెంట్‌లోకి గాడిద వ‌చ్చిందా.? నిరుప‌మ చెప్పిందాంట్లో నిజ‌మెంత‌

Published : Dec 12, 2025, 09:43 PM IST

Fact Check: సోష‌ల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫేక్ వీడియోలు కూడా ఉంటాయి. అయితే వెన‌కా ముందు చూడ‌కుండా ఇవి నిజ‌మైనవేన‌ని కొన్ని మీడియా సంస్థ‌లు టెలికాస్ట్ చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. 

PREV
15
పార్లమెంట్లోకి గాడిద వచ్చిందంటూ..

పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశం జరుగుతోన్న సమయంలో ఓ గాడిద ప‌రిగెత్తుకుంటూ వ‌స్తున్న‌ట్లు క‌నిపించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ గాడిద వేగంగా పరిగెత్తుతూ, అక్కడ ఉన్న వస్తువులు, డెస్కులు, వ్యక్తులను ఢీకొడుతున్నట్లుగా కనిపిస్తోంది.

25
సుమ‌న్ టీవీలో ప్ర‌సారం

ఈ వీడియోను ప్ర‌స్తావిస్తూ సుమ‌న్ టీవీ యాంక‌ర్ నిరుప‌మ ఓ వీడియో చేశారు. పాకిస్తాన్ పార్ల‌మెంట్‌లో గాడిద హల్చ‌ల్ చేసింద‌ని, ఎంపీల కుర్చీలు, డెస్క్‌ల‌పైకి దూసుకెళ్లిందని, గాడిద హంగామాతో నాయ‌కులంతా హ‌డ‌లిపోయారంటూ యాంక‌ర్ చెప్పుకొచ్చారు. వైర‌ల్ అవుతోన్న వీడియోను మీరు కూడా చూడండి అంటూ వీడియో చేశారు.

35
నిజానికి నిజం కాదు

అయితే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోలో ఏమాత్రం నిజం లేద‌ని తేలింది. ఆ క్లిప్‌ను ఫ్రేమ్‌లుగా విడగొట్టి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశారు. కానీ ఆ వీడియోకు సంబంధించి ఏ విశ్వసనీయమైన ఆధారాలు లేదా వార్తలు ల‌భించ‌లేవు. వీడియోను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే గాడిద కదలికలు సహజంగా లేవు. ఈ వీడియో ముమ్మాటికీ ఏఐ జెన‌రేటెడ్ వీడియో అని తేలింది.

45
ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే.?

ఈ వీడియో క్లిప్‌ను Hive Moderation అనే AI-detection వెబ్‌సైట్‌లో పరీక్షించారు. దీంతో ఈ వీడియోలో ఉన్న విజువ‌ల్స్ 93.1 శాతం ఏఐ జెనెరెటెడ్‌గా తేలింది. కాబ‌ట్టి పాకిస్థాన్ పార్ల‌మెంట్‌లోకి గాడిద వ‌చ్చింద‌న్న వార్త‌లో ఎలాంటి నిజం లేదు.

55
వైర‌ల్ అవుతోన్న కామెంట్స్

ఇదిలా ఉంటే సుమ‌న్ టీవీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన నిరూప‌మ వీడియోపై ప‌లువురు నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. కొంద‌రు పాకిస్థాన్ దేశాన్ని కామెడీ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే. మ‌రికొంద‌రు మాత్రం ఇలా ఫేక్ వీడియోల‌ను నిజ‌మైన వీడియోలుగా ప్ర‌చారం చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories