IMDb Top Indian Stars: సీఎం విజయ్, ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన కుర్రాడు, IMDb రేటింగ్ లో నెం.1 ఎవరో తెలుసా?

Published : May 29, 2026, 01:16 PM IST

దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న దళపతి విజయ్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలను వెనక్కి నెట్టి ఓ కొత్త నటుడు నంబర్ 1 స్థానంలోకి వచ్చాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం, ఇంతకీ ఎవరా నటుడు? 

PREV
16
విజయ్, ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన కుర్రాడు..

దళపతి విజయ్, షారుఖ్ ఖాన్‌లకే టక్కరిచ్చిన ఓ కుర్రాడు.. ఒక్కే ఒక్క సినిమాతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాడు. సినిమా ప్రపంచం అంటేనే అంత. ఇక్కడ ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పలేం. ఎంతోమంది రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. కానీ, దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ లాంటి స్టార్లను వెనక్కి నెట్టి ఓ కొత్త నటుడు నంబర్ 1 అయ్యాడంటే నమ్మాల్సిందే!

26
సోషల్ మీడియా సంచలనం..

సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తున్న ఆ నటుడి పేరు యుధ్వీర్ అహ్లావత్ (Yudhvir Ahlawat). ఈ పేరు వినగానే 'ఎవరబ్బా ఇతను?' అనిపించవచ్చు. కానీ, లేటెస్ట్ IMDb (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) లిస్ట్‌లో ఇతను చేసిన మ్యాజిక్ మామూలుగా లేదు.

36
IMDb లిస్ట్‌లో స్టార్ హీరోలు..
సాధారణంగా IMDb పాపులర్ యాక్టర్స్ లిస్ట్‌లో షారుఖ్, సల్మాన్ లేదా సౌత్ సూపర్‌స్టార్ల పేర్లు టాప్‌లో ఉంటాయి. కానీ ఈ వారం అంతా రివర్స్ అయింది! నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 'కర్తవ్య' (Sector 36) సినిమాలో అద్భుత నటనతో యుధ్వీర్ అహ్లావత్ ఈ వారం "మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ"గా నిలిచాడు.
46
ఇండియాన్ స్టార్స్ ను వెనక్కి నెట్టిన కుర్రాడు..
కేవలం మొదటి స్థానం పొందడమే కాదు, అతను వెనక్కి నెట్టిన స్టార్ల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ లిస్ట్‌లో విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ 3వ స్థానంలో ఉండగా, తమిళ 'దళపతి' విజయ్ 4వ స్థానానికి పడిపోయారు. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ 24వ స్థానంలో, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్, అలియా భట్ టాప్ 30లో కూడా లేరు. దీన్ని బట్టి ఈ యువ నటుడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
56
కర్తవ్య లొ అద్భుతమైన నటన..
హర్యానాకు చెందిన ఈ టాలెంటెడ్ యాక్టర్ 2019లో 'సాండ్ కీ ఆంఖ్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తర్వాత 'లవ్ హాస్టల్', 'కో-ఎడ్' వెబ్ సిరీస్‌లలో నటించినా, అతనికి అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం 'కర్తవ్య' సినిమానే. ఈ సినిమాలో 14 ఏళ్ల బాలుడి పాత్రలో అతను జీవించాడు. సైఫ్ అలీ ఖాన్ పక్కన నటిస్తూ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యాడు.
66
IMDb లిస్ట్ ఎలా తయారవుతుందంటే?
IMDb ప్రతి వారం ఈ లిస్ట్‌ను రెడీ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్ల యూజర్లు ఎవరి గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు, ఎవరి ప్రొఫైల్‌ను ఎక్కువగా చూశారు అనే దానిపై ఈ ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది. యుధ్వీర్ నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు అతని గురించి వెతకడం వల్లే ఈ స్థానానికి చేరుకున్నాడు. టాలెంట్ ఉంటే ఎవరినైనా దాటొచ్చని యుధ్వీర్ నిరూపించాడు. భవిష్యత్తులో ఈ యంగ్ యాక్టర్ ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.
Read more Photos on
click me!

Recommended Stories