Rana Daggubati: రూట్‌ మార్చిన రానా దగ్గుబాటి, కొత్త టాలెంట్‌కి పండగే.. `షేప్‌ ఆఫ్‌ మోమో` బెస్ట్ ఎగ్జాంపుల్‌

Published : May 29, 2026, 12:57 PM IST

రానా దగ్గుబాటి ఇప్పుడు నటుడిగా సినిమాల కంటే మంచి టాలెంట్‌ని పరిచయం చేయడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. దానికి ఉదాహరణే ఈ శుక్రవారం విడుదలైన `షేమ్‌ ఆఫ్‌ మోమో` మూవీ. 

PREV
13
సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తోన్న రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి ఇప్పుడు చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు. `బాహుబలి` వరకు హీరోగా జోరు చూపించిన ఆయన ఆ తర్వాత సినిమాలు తగ్గించారు. రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాలు, ఇతర హీరోలు చేయలేని సినిమాలను చేస్తూ ఆకట్టుకున్నారు. సోలో హీరోగా ఆయనకు చాలా గ్యాప్‌ వచ్చింది. చివరగా ఆయన `కాంత` మూవీలో కీలక పాత్రలో మెరిశారు. అయితే ఇప్పుడు నటుడిగా కంటే నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారు. అందులోనూ డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాలు చేయడంలో ముందుంటున్నారు. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తున్నారు.

23
స్పిరిట్‌ మీడియా నేతృత్వంలో ఇండీ సినిమాకి పెద్ద పీఠ

తన నేతృత్వంలోని 'స్పిరిట్ మీడియా'ని మన దేశంలో ఇండీ సినిమాలకు ఒక సరికొత్త ప్లాట్‌ఫామ్‌గా మారుస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇండియాలోని అన్ని భాషలకు చెందిన చిన్న చిత్రాలను, క్రియేటివ్ కథలను సపోర్ట్ చేస్తూ వాటిని థియేటర్ల వరకు తీసుకురావడానికి స్పిరిట్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు రానా. ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలను, మన నేటివిటీకి దగ్గరగా ఉండే నిజాయితీ గల కథలను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా స్పిరిట్ మీడియా ముందుకు తీసుకెళ్తున్నారు. దీనివల్ల పెద్దగా ఎక్స్‌పోజర్ లేని ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ కి, రైటర్స్ కి తమ కథలను దేశవ్యాప్తంగా చూపించే ఒక అద్భుతమైన ఛాన్స్ దొరుకుతోంది.

33
ఈ శుక్రవారం విడుదలైన సిక్కీం ఫిల్మ్ `షేప్‌ ఆఫ్‌ మోమో`

ఈ ఇండీ ఫిల్మ్ మూమెంట్‌లో ప్రస్తుతం నార్త్ ఈస్ట్ సినిమాలు చాలా స్పెషల్ గా నిలుస్తూ వేగంగా ఎదుగుతున్నాయి. సిక్కిం, అస్సాం, మణిపూర్ లాంటి ప్రాంతాల నుండి వస్తున్న సినిమాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ని ఇస్తున్నాయి. అక్కడ ఉండే విభిన్నమైన కల్చర్ ని, అచ్చమైన హ్యూమన్ ఎమోషన్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపిస్తూ గ్లోబల్ లెవెల్ లో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న సిక్కిం మూవీ 'షేప్ ఆఫ్ మోమో' ని చెప్పుకోవచ్చు. ట్రిబేనీ రాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్రెడీ 15 కి పైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది. జోయా అక్తర్, పాయల్ కపాడియా లాంటి క్రేజీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా సపోర్ట్ ఇవ్వడం విశేషం. ఇలాంటి అద్భుతమైన సినిమాలను థియేటర్లకు తీసుకురావడం ద్వారా స్పిరిట్ మీడియా అన్ని ప్రాంతాల సినిమాలకు సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక మంచి సినిమా కల్చర్ ని బిల్డ్ చేస్తోందని రానా వెల్లడించారు. ఇది కొత్త టాలెంట్‌కి మంచి అవకాశంగా చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories