Yatra 2 : యాత్ర2... థియేటర్ లో ఘోరంగా కొట్టుకున్న పవన్ కళ్యాణ్, సీఎం జగన్ ఫ్యాన్స్.. ఎక్కడంటే?

First Published | Feb 8, 2024, 3:37 PM IST

యాత్ర2  చిత్రం ఈరోజే విడుదలైంది. అయితే తాజాగా థియేర్ లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి CM Jagan అభిమానులు ఘోరంగా కొట్టుకున్నారు. వీడియో వైరల్ గా మారింది.

మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి,  ఆయన తనయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర2’ Yatra 2. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎతున రిలీజ్ అయ్యింది. మమ్ముట్టీ వైఎస్సాఆర్ గా... జీవా జగన్ మోహన్ రెడ్డి పాత్రలు పోషించారు. మహి వీ రాఘవ్ దర్శకత్వం వహించారు. 
 

2009లో వైఎస్సాఆర్ మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాత్ర 1.. 2019లో విడుదలైంది. మంచి రిజల్ట్ ను అందుకుంది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘యాత్ర2’ విడుదలైంది. 


ఈ పొలిటికల్ డ్రామా అప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సానుకూలంగా మారింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల తరుణంలో సీక్వెల్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. సినిమా విడుదలైన మొదటి రోజే జగన్ ఫ్యాన్స్ ఆవేశానికి లోనయ్యారు. 

Janasena జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలం సీఎం జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలని ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. 
 

అటు జగన్ అభిమానులు కూడా ఏమాత్రం తగ్గకుండా ఆయా రాజకీయ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘యాత్ర2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవ్వాళ థియేటర్లలో విడుదలైంది. 
 

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని  ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూసేందుకు వచ్చిన పవన్, జగన్ అభిమానులు ఘోరంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పవన్ అభిమానులనే జగన్ ఫ్యాన్స్ దాడి చేసినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలోనే ఇలా ఉందంటే.. ఇంక ఏపీలో ఎలా ఉంటుందోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Latest Videos

click me!