టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న.. యూట్యూబర్ హర్షసాయి..

Published : May 19, 2023, 06:49 PM IST

యూట్యూబర్ గా సోషల్ మీడియాలో  సెన్సేషన్ క్రియేట్ చేశాడు హర్షసాయి. తెలుగు రాష్ట్రాల్లో  ఈ పేరు.. ఆ వ్యక్తి ఎంత ఫేమస్సో అందరికి తెలుసు. ఎంత మంది పోటీకి వచ్చినా..యూట్యూబర్స్ లో స్టార్ అంటే హార్ష సాయి పేరే వినిపిస్తుంది. అటువంటి యంగ్ టాలెంటెడ్ కుర్రాడు త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.   

PREV
17
టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న.. యూట్యూబర్ హర్షసాయి..

యూట్యూబర్స్ లో  టాప్  టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు హర్ష సాయి.  యూట్యూబర్‌గా ఉంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు. అంతే కాదు తన యూట్యూబ్‌ నుంచి వచ్చే ఆదాయాన్ని పేదలకు పంచుతూ.. తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక పేదలకు వారి డ్రీమ్ ఏంటో అడిగి.. వారికి కావలసిన వస్తువులు సమకూర్చుతున్నాడు హర్ష. 
 

27

అంతేనా..చదువుకోవాలని ఉండి.. కష్టాలుపడుతున్న పేద విద్యార్ధుల అవసరాలు కూడా తీరుస్తున్నాడు హర్షసాయి. పెదవారి కల్లల్లో సంతోషాన్ని చూస్తున్నాడు హర్ష. చాలా చిన్న వయస్సులో.. సంపాదించడమే ఎక్కువ అటువంటిది ఆదాయం మొత్తాన్ని పేదలకు పంచి పెడుతున్నాడు. 

37

వందలు వేలల్లోనే కాకుండా..  లక్షల రూపాయలను మంచి పనుల కోసం  మంచి నీళ్లలా పంచేస్తున్నాడు హర్ష సాయి.ఈ మంచి తనమే అందరికిలో స్పెషల్ గా నిలించింది. అంత కాదు.. ఇలాంటి పనులు చేయడంవల్లనే హర్ష సాయికి ప్రత్యేకంగా ప్యాన్ బేస్ తయారయ్యింది. అభిమాన సఘాలు కూడా తయరయ్యాయి. హర్షా సాయి పేరుతో పాదయాత్రలు కూడాచేస్తున్నారు ఫ్యాన్స్. 

47

హర్ష సాయికి తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి..  ఇక ఈ యంగ్ స్టార్  యూట్యూబ్‌ ఛానళ్లకు మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లు కూడా  ఉన్నారు. దాంతో ఆన ఇమేజ్ ఓ రేంజ్ లో పెరుగుతూ వస్తోంది. ఈక్రమంలోనే హర్ష గురించి ఓ న్యూస్  ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. 

57

యూట్యూబ్‌లో హార్ష సాయికి 80 లక్షల 64 వేల మంది( 8.64 మిలియన్ల) ఫాలోవర్స్ ఉండగా..... ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకు (4మిలియన్ల) ఫాలోవర్స్.. ఉన్నారు. ఇక ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చూస్తే.. దాదాపు కోటిమంది హర్షసాయిని ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో.. అయితే హర్షసాయి తను చేస్తున్న సామాజిక కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వస్తాడని జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ గతంలో రూమర్స్ గట్టిగా వినిపించాయి.కాని కొంత కాలానికి అవి ఆగిపోయాయి. 
 

67

ఇక ఇప్పుడు తాజాగా హర్షసాయి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.  దీనికి సంబంధించి తాజాగా తను ఓ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఓ కొత్త సినిమాతో అలరించడానికి సిద్దమైంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పాన్ ఇండియా లెవెల్ లో యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్షసాయి భాగం కాబోతున్నాడట.

77

మిత్రా శర్మ నిర్మించబోయే ఈ సినిమా లో..హర్షసాయి హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో పాటు.. ఈసినిమాకు డైరెక్షన్ కూడా అతనే చేయబోతున్నట్టు తెలుస్తోంది. సిక్స్ ప్యాక్‌తో .. టోన్డ్ బాడీతో హర్షసాయి టాలీవుడ్ లో కొంత మంది హీరోలకంటే బాగానే ఉంటాడు. మరి నటన విషయంలో మెప్పించగలడా అనేది చూడాలి. త్వరలో ఈసినిమాకు సబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. 

click me!

Recommended Stories