హీరోగా యూట్యూబర్ హర్షసాయి.. అఫీషియల్ అనౌన్స్ మెంట్,ఫస్ట్ లుక్ కూడా రెడీ..

First Published | Sep 15, 2023, 8:58 AM IST

అనుకున్నదే జరిగింది. య్యూట్యూబర్ గా కోట్ల మంది అభిమానాన్ని సాధించిన హర్ష సాయి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఇంతకీ అసలు సంగతేంటంటే..? 

హర్ష సాయి తెలుగు రాష్ట్రాల్లో  ఈ పేరు.. ఆ వ్యక్తి ఎంత ఫేమస్సో అందరికి తెలుసు.  యూట్యూబర్ గా సోషల్ మీడియాలో  సెన్సేషన్ క్రియేట్ చేశాడు హర్షసాయి. ఎంత మంది పోటీకి వచ్చినా..యూట్యూబర్స్ లో స్టార్ అంటే హార్ష సాయి పేరే వినిపిస్తుంది. అటువంటి యంగ్ టాలెంటెడ్ కుర్రాడు వెండితెర ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం కుదిరింది. 

గతంలోనే హర్షసాయి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. అందులో ముఖ్యంగా హర్ష సాయి రాజకీయాల్లకి వెళ్తున్నాడని. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ సమక్షంలో.. హర్ష జనసేనలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అది నిజం కాలేదు. కాని హర్షసాయి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వచ్చిన వార్తలు మాత్రం ప్రస్తుతం నిజం అయ్యాయి. రీసెంట్ గానే హర్ష హీరోగా సినిమా అనౌన్స్ అయ్యింది. 


హర్షసాయి హీరోగా సినిమా తెరకెక్కుతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అంతే కాదు  పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నెల 17వ తేదీన ఈ మూవీ టైటిల్ ను ప్రకటించడంతో పాటు టీజర్ ను లాంఛ్ చేయనున్నారు. అంతే కాదు ఈసినిమా నిర్మాతపై కూడా షాకింగ్ న్యూస్ తెలుస్తోంది. 
 

ఈసినిమాను  బిగ్ బాస్ కంటెస్టెంట్ మిత్ర శర్మ, సీఎం కేసీఆర్ బంధువు కల్వకుంట్ల వంశీధర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  హైదరాబా లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ ఈవెంట్ జరగనుంది. మిత్ర శర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చేసిన పోస్ట్ తో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

ఇక హర్షసాయి హీరోగా తెరకెక్కుతోన్న ఈసినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. హర్షసాయి సినిమాల్లో సక్సెస్ కావడంతో పాటు స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

యూట్యూబర్స్ లో  టాప్  టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు హర్ష సాయి.  యూట్యూబర్‌గా ఉంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు. అంతే కాదు తన యూట్యూబ్‌ నుంచి వచ్చే ఆదాయాన్ని పేదలకు పంచుతూ.. తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక పేదలకు వారి డ్రీమ్ ఏంటో అడిగి.. వారికి కావలసిన వస్తువులు సమకూర్చుతున్నాడు హర్ష. 
 

అంతేనా..చదువుకోవాలని ఉండి.. కష్టాలుపడుతున్న పేద విద్యార్ధుల అవసరాలు కూడా తీరుస్తున్నాడు హర్షసాయి. పెదవారి కల్లల్లో సంతోషాన్ని చూస్తున్నాడు హర్ష. చాలా చిన్న వయస్సులో.. సంపాదించడమే ఎక్కువ అటువంటిది ఆదాయం మొత్తాన్ని పేదలకు పంచి పెడుతున్నాడు. 
 

హర్ష సాయికి తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి..  ఇక ఈ యంగ్ స్టార్  యూట్యూబ్‌ ఛానళ్లకు మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లు కూడా  ఉన్నారు. దాంతో ఆన ఇమేజ్ ఓ రేంజ్ లో పెరుగుతూ వస్తోంది. ఈక్రమంలోనే హర్ష సాయి హీరోగా వస్తున్నాడన్న న్యూస్ వైరల్ అవుతోంద. 
 

Latest Videos

click me!