రేటు పెంచిన కుర్ర హీరోలు, టాలీవుడ్ యంగ్ స్టార్స్ ఎంత డిమాండ్ చేస్తున్నారంటే?

Published : Oct 15, 2025, 03:23 PM IST

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల హవా నడుస్తోంది. వరుసగా విజయాలు సాధిస్తూ..భారీగా వసూళ్లు కూడా చేస్తుండటంతో.. కుర్ర హీరోలు రేటు పెంచేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేస్తున్నారు. 

PREV
15
చిన్న హీరోల హవా

టాలీవుడ్ లో ప్రస్తుతం చిన్న హీరోల హవా పెరిగిపోయింది. వరుస విజయాలతో కుర్ర హీరోలు రెచ్చిపోతున్నారు. మంచి మంచి కాన్సెప్ట్ లను ఎంచుకుని అదిరిపోయే స్క్రీన్ ప్లేతో సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో రూపొందుతోన్న చిన్న సినిమాలే అయినా.. అవి పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను రాబడుతున్నాయి. మిరాయ్ హీరో తేజ సజ్జా, లిటిల్ హార్ట్స్ మౌళి, సుహాస్, సిద్దు, ప్రియదర్శి, ఇలా యంగ్ హీరోలంతా తమ రెమ్యునరేషన్ ను భారీగా పెంచేస్తున్నారట.

25
పాన్ ఇండియా హీరోగా

చైల్డ్ ఆర్టిస్ట్ లలో హీరోలుగా మారినవారు ఇండస్ట్రీలో పెద్దగా నిలబడలేకపోయారు. కానీ వారికి భిన్నంగా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు తేజ సజ్జా. సినిమాల విషయంలో మంచి ప్లానింగ్ తో వెళ్తున్నాడు తేజ. తనకు సూట్ అయ్యే కథలనే ఎంచుకుంటున్నాడు. రీసెంట్ గా మిరాయ్ సినిమాతో మెస్మరైజ్ చేశాడు కుర్ర హీరో. గతంలో హనుమాన్ సినిమాకు 2 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్న తేజ సజ్జా.. మిరాయ్ కోసం 5 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. నెక్ట్స్ మూవీకి 10 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట కుర్ర హీరో.

35
మౌళి టైమ్ మామూలుగా లేదు.

కుర్ర హీరోలు చిన్న బడ్జెట్ మూవీస్ తో మంచి విజయాలను సాధించి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటున్నారు. సినిమా సక్సెస్ అవ్వగానే రెమ్యునరేషన్ ను భారీగా పంచుతున్నారు. రీసెంట్ గా వరుస విజయాలు చూస్తున్నాడు కుర్ర హీరో మౌళి, లిటిల్ హార్ట్స్ మూవీతో బాగా ఫేమస్ అయ్యాడు, అంతకు ముందు 1990 లో సినిమాతో మౌళిపేరు మారుమోగిపోయింది. ఇక తాజాగా లిటిల్ హార్ట్స్ సినిమాతో తిరుగులేని సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మౌళి గతంలో 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ మూవీకి 35 లక్షల వరకూ వసూలు చేశాడని టాక్. ఇక నెక్ట్స్ సినిమాకోసం కోటి నుంచి రెండు కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడని టాక్.

45
యాటిట్యూడ్ చూపిస్తోన్న సిద్దు

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో హడావిడి చేస్తున్న హీరోలలో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. వరుస విజయాలతో టాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తున్నాడు యంగ్ హీరో. అటు మాస్, ఇటు క్లాస్ రెండు వర్గాల ఆడియన్స్ ను టార్గెట్ చేసిన సిద్దు.. యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈమధ్య కాలంలో డీజే టిల్లు సినిమాతో రచ్చ రచ్చ చేసిన ఈ హీరో 10 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. త్వరలో తెలుసుక కదా మూవీతో రాబోతున్నాడు సిద్దు.. ఈసినిమాలో మరింత యాటిట్యూడ్ చూపించబోతున్నాడు. ఇక రెమ్యునరేషన్ విషయంలో మాత్రం గతంలో మంచి మనసు చాటుకున్నాడు యంగ్ హీరో. తనతో సినిమా చేసి నష్టపోయిన నిర్మాతకు 4 కోట్లు వెనక్కి ఇచ్చేశాడట సిద్దు. 

55
రూటు మార్చిన కామెడి హీరోలు

యంగ్ హీరోలందరు ఒకటి రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వగానే రెమ్యునరేషన్ ని భారీగా పెంచేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలనే సుహాస్, ప్రియదర్శి లాంటి యంగ్ కమెడియన్లు కూడా హీరోలుగా మారి చిన్నబడ్జెట్ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ సాధిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు గతంలో లక్షల్లో రెమ్యురేషన్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు సినిమాకు రెండు కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు తెలస్తోంది. ఇలా చిన్న హీరోలు పెద్ద విజయాలతో భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories