NTR Double Hattrick : డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

Published : Mar 28, 2022, 01:01 PM IST

స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR) తాజాగా ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. కాగా, తారక్ చివరి ఐదు సినిమాలు కూడా హిట్ కావడంతో టాలీవుడ్ లో డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోగా నిలిచిపోయాడు.

PREV
18
NTR Double Hattrick : డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

ప్రస్తుతం టాలీవుడ్ కా బాద్ షా అనిపించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వరుస సినిమాల్లో నటిస్తూ నందమూరి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’RRR మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించారు. కొమరం భీం, అల్లూరి సీతారామారాజు పాత్రలను పోషించారు. 
 

28

భారీ చిత్రం మల్టీస్టారర్, పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25 2022లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. విడుదలకు ముందే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదల తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ తో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సందడి చేస్తోంది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం  చేసుకోవడంతో.. ఎన్టీఆర్ కేరీర్ లో మరో బ్లాక్ బాస్టర్ హిట్ పడింది. గతంలో యమదొంగ, సింహాద్రి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. 
 

38

అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రెండోసారి నటించిన ‘టెంపర్’ మూవీతో ఎన్టీఆర్ వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు. 2015 ఫిబ్రవరి 13న ఈ చిత్రం రిలీజ్ అయి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టగా రూ.74కు పైగా వసూళ్లు చేసింది.
 

48

టెంపర్ తర్వాత.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘నాన్నకు ప్రేమతో’ అనే యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ నటించారు. 2016 జనవరి 13న రిలీజైన ఈ చిత్రానికి కూడా ఆడియెన్స్ నుంచి సెమీ హిట్ రెస్పాన్స్ ను సాధించుకుంది. అయినా ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అభిమానులు ఇష్టపడుతారు. రూ. 45 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్ల మేర వసూళ్లు చేసింది.  
 

58

ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రం 2016 సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ గా నలిచింది. కలెక్షన్ల పరంగా చూసుకుంటే రూ. 50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టగా.. రూ.135 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు అంచనా. 
 

68

బ్లాక్ బాస్టర్ జోష్ లోనే 2017లో సెప్టెంబర్ 21న ‘జై లవ కుశ’ చిత్రంతో ప్రేక్షకుల  ముందుకు వచ్చాడు తారాక్. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ చిత్రాన్ని కేఎస్ రవీంద్ర డైరెక్ట్ చేశారు. మూవీ బడ్జెట్ రూ.45 కోట్లు కాగా.. రూ.150 కోట్ల వరకు వసూళ్లు చేసిన్టు బాక్సాఫీస్ అంచనా రిపోర్ట్.
 

78

తర్వాత, మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘అరవింద సమేత’ చిత్రంలో నటించారు ఎన్టీఆర్.   ఆర్ఆర్ కు ముందు వచ్చిన ఎన్టీఆర్ చిత్రం ఇదే. 2018 అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ఫ్యాన్స్ ను  ఆకట్టుకుంది. మూవీకి బడ్జెట్ రూ.60 కోట్లు పెట్టగా.. రూ.165 కోట్లు వసూళ్లు చేసింది.    

88

ఇక ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే మొత్తంగా దాదాపు రూ.400 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టు రిపోర్ట్స్ చూస్తే అర్థమవుతోంది. బ్లాక్ బాస్టర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇలా 2015 నుంచి ఎన్టీఆర్ వరుసగా నాలుగు హిట్లను, రెండు బ్లాక్ బాస్టర్ మూవీలను తన ఖాతాలో వేసుకున్నాడు.  దీంతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుని, టాలీవుడ్ కా బాద్షా అనిపించుకుంటున్నాడు. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

click me!

Recommended Stories