మేకప్‌ లేకుండా క్యూట్‌గా కుర్రాళ్లని కవ్విస్తున్న కీర్తిసురేష్‌.. పెట్‌ డాగ్‌తో చిలిపి పనులు.. అసలైన అందం

Published : Mar 28, 2022, 11:57 AM IST

కీర్తిసురేష్‌ కెరీర్‌ బిగినింగ్‌లోనే విలక్షణ పాత్రలతో మెప్పిస్తుంది. నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. తెరపై కనువిందుగా ఉండే ఆమె మేకప్‌ లేకుండా అసలైన అందాలు చూపించింది.

PREV
15
మేకప్‌ లేకుండా క్యూట్‌గా కుర్రాళ్లని కవ్విస్తున్న కీర్తిసురేష్‌.. పెట్‌ డాగ్‌తో చిలిపి పనులు.. అసలైన అందం

`మహానటి` చిత్రంతో టాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకున్న కీర్తిసురేష్‌(Keerthy Suresh). మహానటిగా అనేదే తన పేరుగా మార్చుకుంది. అద్బుతమైన నటిగా మెప్పిస్తుంది. అదే సమయంలో గ్లామర్‌ వైపు కూడా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. అడపాదడపా కాస్త ఘాటెక్కించే పోజులతో ఫోటో షూట్‌ చేస్తూ ఆమె పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

25

తాజాగా మేకప్‌ లేకుండా కనిపించింది కీర్తిసురేష్‌. తన పెట్‌ డాగ్‌తో కలిసి ఆమె క్యూట్‌ పోజులిచ్చింది. మేకప్‌ లేకపోయినా కీర్తి ఎంతో క్యూట్‌గా ఉండటం విశేషం. ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. అసలైన అందాలతో కనువిందు చేస్తుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది కీర్తిసురేష్‌. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

35

కీర్తిసురేష్‌ తన పెట్‌ డాగ్‌తో ఎంతో అనుబంధాన్ని కొనసాగుతుంది. దాని పేరు నైక్‌. ఆ డాగ్‌ని ఒక కూతురు మాదిరిగా చూసుకుంటోంది. అంతేకాదు ఏకంగా తన పెట్‌కి ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ని కూడా ఓపెన్‌ చేయడం విశేషం. ఇందులో పెట్‌తో దిగిన ఫోటోలను షేర్‌ చేస్తుంది కీర్తి. ఆ డాగ్‌ ఈ పేజీని మెయింటేన్‌ చేస్తున్నట్టుగా ఆమె పోస్ట్ లు పెట్డడం మరో విశేషం. 
 

45

కీర్తిసురేష్‌ అంటే ట్రెడిషనల్‌ అందానికి కేరాఫ్‌. అందమంటే పొట్టిబట్టల్లో కాదని, నిండైన శారీలో ఉంటుందని చాటుతున్న కథానాయిక. మోడ్రన్‌ దుస్తుల్లో అసలైన అందాలను చూపిస్తూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తున్న ఎంతో మంది హీరోయిన్లకి ఆదర్శంగా నిలుస్తుంది కీర్తిసురేష్‌. శారీతో కనిపిస్తూ ఎంతగా ఆకట్టుకుంటుంది. శారీలో తన హాట్‌ అందాలను చూపిస్తూ నెటిజన్లలో హీటు పెంచడం కూడా కీర్తికి తెలుసు. అయితేకొన్ని సార్లు తాను కూడా మోడ్రన్‌ దుస్తుల్లో మెరుస్తూ కనువిందు చేస్తుంటుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది కీర్తి. 

55

ఇక కీర్తిసురేష్‌ ఇప్పుడు పలు క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె మహేష్‌తో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తుంది. అలాగే నానితో `దసరా` సినిమా చేస్తుంది. తమిళంలో రెండు సినిమాలు, మలయాళంలో రెండు చిత్రాల్లు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఆమె ఓ వీడియో సాంగ్‌లోనూ నర్తించిన విషయం తెలిసిందే. ఆద్యంతం కలర్‌ఫుల్‌గా  సాగే ఆ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories