Intinti Gruhalakshmi: ట్విస్ట్ అదిరింది.. అత్త మామలను లాస్య దగ్గరకు పంపించేసిన తులసి?

Navya G   | Asianet News
Published : Mar 28, 2022, 12:13 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Intinti Gruhalakshmi: ట్విస్ట్ అదిరింది.. అత్త మామలను లాస్య దగ్గరకు పంపించేసిన తులసి?

ఇక తల్లి మాటలకు దీనంగా ఆలోచిస్తున్న ప్రేమ్ (Prem)  ను చూసి శృతి తన భర్తని వెనకేసుకు వస్తూ.. వాళ్ళ అత్తగారి పై నింద వేస్తుంది. అంతేకాకుండా శృతి (Sruthi).. ప్రేమ్ తో ఈరోజు నుంచి నువ్వు ఆటో నడపడం మానేయాలి. నీ లక్ష్యం వైపు నువ్వు నడవాలి అని అంటుంది.
 

26

నీ గురించి నేను గర్వంగా చెప్పుకోవాలి అందుకోసం నేను ఏమైనా చేస్తాను అని శృతి (Sruthi) అంటుంది. మరో వైపు నందు అమ్మ వాళ్ళు నాతో రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు. ఎందుకు మొండిగా చేస్తున్నారు. అని తులసి ను అడుగుతాడు. ఆ క్రమంలో నందు (Nandhu)  మా అమ్మ నాన్నలను నాతో వచ్చేలా ఒప్పించు అని చెబుతాడు.
 

36

దాంతో తులసి (Tulasi)  కుదరదు అని అన్నట్లుగా మాట్లాడుతుంది. దాంతో నందు (Nandhu) మా అమ్మ నాన్నలను నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా అని కోపంగా విరుచుకు పడతాడు. అంతేకాకుండా ఎలాగైనా మా అమ్మ నాన్నలను నావెంట వచ్చేలా ఒప్పించాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
 

46

మరోవైపు ప్రేమ్ (Prem)  నువ్వు సంపాదిస్తూ నన్ను కూర్చో పెట్టడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని బాధ పడతాడు. ఆ తర్వాత దివ్య (Divya) ప్రేమ్ కు ఫోన్ చేసి డాడ్ లాస్య ఆంటీ ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు అని చెబుతుంది. దాంతో ప్రేమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు.
 

56

ఆ తరువాత ప్రేమ్ (Prem)  ను జాబ్ సంగతి ఏం చేసావ్ అని శృతి అడగగా నువ్వు ఎలా చెప్తే అలా అంటాడు. దాంతో శృతి ఎంతో ఆనంద పడుతుంది. మరోవైపు తులసి (Tulasi) ఇంట్లో వాళ్ళని ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా తానే ఇంటి నుంచి వెళ్లి పోవడానికి సిద్దమై బ్యాగ్ సర్దుకుని అత్తమామలకు చెబుతుంది.
 

66

దాంతో తులసి (Tulasi) వాళ్ళ అత్త మామలు నువ్వు ఇంటినుంచి బయటికి వెళ్లి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా తులసి అంటూ బాధపడతారు. దాంతో నందు (Nandhu) తల్లి దండ్రులు మాకు నందు తో వెళ్లడం ఇష్టం లేదు అని చెప్పి లెటర్ రాసి వెళ్ళిపోతారు. ఇక ఆ లెటర్ నందు చదువుతూ ఉండగా తులసి దాన్ని విని ఎంతో బాధ పడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఎం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories