ఎన్టీఆర్ - ధనుష్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ మూవీ..? దర్శకుడెవరంటే..?

First Published | Feb 7, 2023, 4:22 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని అనుకోని కాంబినేషన్లు షాక్ ఇస్తుంటాయి..సడెన్ గా సినిమా అనౌన్స్ మెంట్ తో సర్ ప్రైజ్ ఇస్తుంటాయి. అటువంటి సర్ ప్రైజ్ ఒకటి టాలీవుడ్ లో నుంచి రాబోతున్నట్టు సిగ్నల్స్ అందుతున్నాయి. అసలేంటి ఆ సర్ ప్రైజ్.. ఎంత వరకూ నిజం.

రాజమౌళి ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య బాహుబలితో ఎల్లలు చెరిపివేసిన తరువాత.. భాషా బేధాలు లేకుండా.. అన్ని భాషల హీరోలు పాన్ ఇండియా గొడుగుకిందకు వస్తున్నారు. ఈ భాష... ఆ భాష అని తేడా లేకుండా.. సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని భాషల నుంచి టాలీవుడ్ కు వలసలు పెరిగిపోయాయి. 

Dhanush

మన సినిమాను తక్కువ చేసిన హిందీ,తమిళ ఇండస్ట్రీల నుంచి కూడా స్టార్ హీరోలు తెలుగులో సినిమాలు చేయడానికి ఆరాటపడుతున్నారు. ఈక్రమంలో విజయ్,ధనుష్ లాంటి హీరోలు తెలుగు తెరనుంచి డైరెక్ట్ సినిమాలు చేస్తున్నారు. 


ఇప్పటికే విజయ్ వారసుడు రిలీజ్ అవ్వగా.. ధనుష్ సార్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈక్రమంలో తెలుగు,తమిళ స్టార్ హీరోల కాంబినేషన్ లో క్రేజీ మల్టీ స్టారర్ మూవీస్ గురించి క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈమధ్య  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - తమిళ స్టార్ హీరో ధునుష్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ గురించి క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. 

ఈ ఇద్దరు స్టార్లతో పాన్ ఇండియా రేంజ్ లో మూవీ తెరకెక్కుతున్నట్టు వార్త వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్నదానిపై కూడా పక్కాగా ఒకటే మాట వినిపిస్తుంది.  ధనుష్ కు అసురన్  లాంటి బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చిన  తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ ఎన్టీఆర్, ధనుష్ కలిపి సినిమా చేయబోతున్నారట. 
 

ఈ న్యూస్ కోలీవుడ్ మీడియా నుంచి ప్రముఖంగా వనిపిస్తుంది. అయితే  రెండు భాగాలుగా రాబోతున్నఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్ నటిస్తాడని సమాచారం. ఇక సెకండ్ పార్ట్ మూవీ మొత్తాన్ని ధనుష్ లీడ్ చేస్తాడని తమిళనాట వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ ని కలిసి వెట్రిమారన్ స్టోరీ వినిపించగా, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అయితేప్రస్తుతం కొరటాల శివ సినిమాకు పనిచేయబోతున్న ఎన్టీఆర్ ఆతరువాత  ప్రశాంత్ నీల్ సినిమా చస్తారు. ఆ తరువాత ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.  ప్రస్తుతం ధనుష్ అండ్ వెట్రిమారన్ కూడా కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉన్నారు.

అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియదు. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు అది నిజం అయితే బాగుండు అని  ఆశ పడుతున్నారు. 

Latest Videos

click me!