బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న సదా.. స్టన్నింగ్ లుక్స్.. ‘జయం’ భామ ఫస్ట్ టాటూ సీక్రెట్ ఇదే..

First Published | Feb 7, 2023, 4:16 PM IST

సీనియర్ హీరోయిన్ సదా (Sada) లేటెస్ట్ లుక్ లో ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా తన చేతిపై వేయించిన ఫస్ట్ టాటూను చూపిస్తూ మురిసిపోయింది. ఈ సందర్భంగా ఫొటోలకు క్యూట్ గా పోజులిస్తూ మెస్మరైజ్ చేసింది
 

ఇటీవల సీనియర్ హీరోయిన్ సదా ఓ టాటూను వేయించుకున్న విషయం తెసిందే. వెజిటేరియన్ అయిన టాటూ  ప్రొఫెషనలిస్ట్ తో అందమైన టాటూను తన కుడిచేతిపై వేయించుకుంది. ఇక తాజాగా టాటూను చూపిస్తూ మురిసిపోయింది.
 

సదా లైఫ్ లోనే మొట్టమొదటి సారిగా ఈ టాటూ (Tattoo)ను వేయించుకోవడం విశేషం. ఇందుకు ఎంతగానో సంతోషించింది.  ఆ విషయాన్ని ఇప్పటికే అభిమానులతో  పంచుకుంది. ఒకప్పుడు టాటూనే వ్యతిరేకించే ఈ బ్యూటీ.. రీసెంట్ గా బ్యూటీఫుల్ టాటూను వేయించుకోవడం విశేషం. 
 


జీవితంలో ఏదీ స్థిరంగా ఉండదనే విషయాన్ని గమనించి రీసెంట్ గా తన నిర్ణయాన్ని మార్చుకుందీ బ్యూటీ. ఈ మేరకు తనకు ఎంతో ఇష్టమైన క్యాట్ ఫూట్ ప్రింట్ మరియు వెజిటేరియన్ అని చెప్పేందుకు సింబాలిక్ గా లీఫ్ ను టాటూగా వేయించింది.
 

ఫస్ట్ టైమ్ టాటూ వేయించుకోవడంతో కాస్తా ఎగ్జైట్ ఫీలవుతోంది. తన ఆనందాన్ని అభిమానులతోనూ షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా టాటూను చూసుకుంటూ మురిసిపోతున్నట్టుగా కొన్ని  ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు సదా బ్లాక్ ట్రెండీ అవుట్ ఫిట్ లో కట్టిపడేశారు. మెరిసిపోయే చర్మ సౌందర్యంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేశారు. నేచురల్ బ్యూటీతో కుర్ర గుండెల్ని దోచేసిందీ ‘అపరిచితుడు’ భామ. దీంతో ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఆ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
 

ఇక సదా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తున్న ‘జయం’భామ.. గ్లామర్ టేస్ట్ కూడా చూపిస్తున్నారు. మరోవైపు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా ‘హాలో వరల్డ్’ వెబ్ సిరీస్ తో అలరించింది. 
 

Latest Videos

click me!