విజయ్ దేవరకొండ ‘ఖుషి’లో యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. నిజమేనా.?

Published : Dec 05, 2022, 01:48 PM ISTUpdated : Dec 05, 2022, 01:49 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) నటించే ఛాన్స్ కొట్టేసింది. అదీ ‘ఖుషి’ చిత్రంలోనే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమంత నటిస్తుండగా..  కృతి పేరు కూడా వినిపిస్తోంది.  

PREV
16
విజయ్ దేవరకొండ ‘ఖుషి’లో యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. నిజమేనా.?

హ్యాట్రిక్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. యంగ్ బ్యూటీ స్పీడ్ కు స్టార్ హీరోయిన్లకే మతిపోయింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ రచ్చ చేస్తూ వస్తోంది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో కృతి శెట్టి పేరు హాట్ టాపిక్ గా నిలిచింది. 
 

26

కొత్త ప్రాజెక్ట్ లలో ఈ బ్యూటీని ఎంపిక చేసుకునేందుకు ఏమాత్రం సందేహించడం లేదు. ఇటీవల కొన్ని చిత్రాలు సక్సెస్ సాధించకున్నా.. కృతి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ బ్యూటీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

36

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - స్టార్ హీరోయిన్ సమంత (Samantha) జంటగా ‘ఖుషి’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత అనారోగ్యానికి గురవడంతో ప్రస్తుతం షూటింగ్ ఆగినట్టు తెలుస్తోంది.
 

46

ఈ క్రమంలోనే ‘ఖుషి’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. సినిమాలో మరో హీరోయిన్ గా కృతి శెట్టి అవకాశం దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. సమంతతో పాటు కృతి కూడా సినిమాలో అలరించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కృతి తొలిసారిగా నెగెటివ్ షెడ్స్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సమంత కోలుకునే వరకు ఈమెతో షూటింగ్ కొనసాగించనున్నారని అంటున్నారు. 
 

56

కృతి నటించిన చివరి మూడు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ బ్యూటీకి కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో విజయ్ సినిమాలో నిజంగానే అవకాశం వచ్చి ఉంటే సెఫ్ జోన్ లోనే ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

66

‘ఉప్పెన’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి వరుసగా ఆఫర్లను అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ ఆరు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసుకుంది. ప్రస్తుతం మలయాళంలో ‘అజాయంతే రందం మోషణం’ చిత్రంలో నటిస్తోంది.  

Read more Photos on
click me!

Recommended Stories