Shivathmika Rajashekar: శివాత్మిక సమ్మర్ ట్రీట్.. నైట్ వేర్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ

Published : Apr 26, 2022, 12:18 PM ISTUpdated : Apr 26, 2022, 12:21 PM IST

శివాత్మిక అభిమానులకు ఊపిరి సలపకుండా చేస్తుంది. వేడి వేడి అందాలతో నాన్ స్టాప్ గా దాడి చేస్తుంది. శివాత్మిక లేటెస్ట్ ఫోటోలు గ్లామర్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లున్నాయి. నైట్ వేర్ ని తలపిస్తున్న ట్రెండీ డ్రెస్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చారు.

PREV
18
Shivathmika Rajashekar: శివాత్మిక సమ్మర్ ట్రీట్.. నైట్ వేర్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ
Shivathmika Rajashekar

తెలుగు బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar)సోషల్ మీడియా వేదికగా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ స్టార్ కిడ్ వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. వెండితెరపై అలరిస్తూనే ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
 

28
Shivathmika Rajashekar

సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడిప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్. మొదటి చిత్రంతోనే తన నటనతో వెండితెరపై తన మార్క్ క్రియేట్ చేసింది ఈ చిన్నది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

38
Shivathmika Rajashekar

కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకున్నా శివాత్మిక ప్రతిభ కనబరిచారు. దొర కూతురు పాత్రలో శివాత్మిక అలరించారు. మొదటి చిత్రమే అయినా, చక్కని నటనతో శివాత్మిక ఆకట్టుకున్నారు. అయితే శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, కెరీర్ మెల్లగా సాగుతుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ దక్కవని చెప్పడానికి శివాత్మిక మరొక ఉదాహరణ.

48
Shivathmika Rajashekar


అక్క శివాని (Shivani) కంటే ముందే కెరీర్ ప్రారంభమైనా బ్రేక్ రాలేదు. రాబోయే చిత్రాలలో తానేమిటో నిరూపించుకొని, హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని, చూస్తున్నారు. అచ్చ తెలుగు అందాల ఈ సుందరి టాలెంట్ ని దర్శక నిర్మాతలు గుర్తించకపోవడం బాధారకమని చెప్పాలి. 

58


ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ (Rangamarthanda)మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై స్పష్టత లేదు. 

68

అలాగే బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పంచతంత్రం (Panchatantram)మూవీలో సైతం శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. స్వాతి రెడ్డి, సముద్ర ఖని వంటి నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. దొరసాని చిత్రంతో నటిగా నిరూపించుకున్న శివాత్మిక, భవిష్యత్ లో స్టార్ రేంజ్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

78
shivathmika rajashekar

రంగమార్తాండ, పంచతంత్రం చిత్రాలతో ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా శివాత్మిక కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి. అలాగే శివాత్మికకు తమిళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. బర్త్ డే నాడు నిథమ్ ఒరు వానమ్ అనే బైలింగ్వల్ మూవీ ప్రకటించారు. 

88


  మరోవైపు శివాత్మిక అక్క శివాని 'అద్భుతం' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఓటిటిలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. శివాని పెర్ఫార్మన్స్ క్రిటిక్స్ ని మెప్పించడం విశేషం. శివాని సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే ఇటీవల ఓ తమిళ చిత్రం ప్రకటించారు. ఇద్దరు సిస్టర్స్ తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 

click me!

Recommended Stories