Extra Jabardasth : పలుమార్లు సుధీర్ ఇంటికి రష్మీ... రావొద్దంటూ కమెడియన్ తండ్రి జబర్దస్త్ వార్నింగ్

Published : Apr 26, 2022, 11:12 AM IST

యాంకర్ రష్మి గౌతమ్ ఈ మధ్య పదేపదే సుడిగాలి సుధీర్ ఇంటికి వెళ్తోందట. ఇదే విషయాన్ని సుధీర్ బయటపెట్టడంతో మరోసారి ఇంటికి రావొద్దంటూ జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ రష్మీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు... అసలేం జరిగిందంటే.?

PREV
16
Extra Jabardasth : పలుమార్లు సుధీర్ ఇంటికి రష్మీ... రావొద్దంటూ కమెడియన్ తండ్రి జబర్దస్త్ వార్నింగ్

సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam) ఇద్దరి పేర్లు బుల్లితెరపై ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఈటీవీలో ప్రసారమయ్యే షోలలో ఈ జంట సందడి చేస్తూ ఉంటుంది. ఎక్కువుగా జబర్దస్త్ కామెడీ షోలో రష్మి, సుధీర్ రొమాన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. 
 

26

అయితే, ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ (Jabardasth), ఎక్స్ ట్రా జబర్దస్త్ (Extra Jabardasth) కామెడీ షోలకు లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఈ షోనుంచి వచ్చే ప్రతి ఎపిసోడ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. 

36

జబర్దస్త్ కామెడీ షో పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చే టీం సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer Team). మిగతా టీంలతో పోల్చితే సుధీర్ టీం చేసే స్కిట్స్ ఎక్కువగా ఆకట్టుకునేలా ఉంటాయి. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బుల్లితెరపై కనిపిస్తే నవ్వులు పూయడం కాయం.
 

46

ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ప్రతి శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అవుతోంది. ఈ కామెడీషోకు  సంబంధించిన లేటెస్ట్ ప్రొమోను రిలీజ్ చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ కలిసి చేసిన స్కిట్ ఇంట్రెస్టింగ్ ఉంది. 

56

ఈ స్కిట్ లో... షుగర్ కావాలి, సాల్ట్ కావాలంటూ రష్మి గౌతమ్ సుధీర్ ఇంటికి పదే పదే వెళ్లిందట. ఇదే విషయాన్ని సుధీర్ కు తండ్రి పాత్రను పోషించిన జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ కు చెప్పాడు. దీంతో ఆయన ఇంకోసారి ఇంటికి రావొద్దంటూ రష్మికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత సుధీర్ లైఫ్ ఎలా ఉందనేది మిగితా స్కిట్.
 

66

సుడిగాలి సుధీర్ స్కిట్ తో పాటు, మిగతా టీమ్స్ కూడా అదిరిపోయే స్కిట్స్ తో నవ్వించారు. లేటెస్ట్ ప్రోమో ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది. కాగా ఈ ఎపిసోడ్ ఏప్రిల్ 29న ఈటీవీలో ప్రసారం కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories