ఈ యువ దర్శకుడు చేసిన ఆరోపణలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ తో ఎండార్స్మెంట్స్ కూడా చేసిన రాజసింహ, ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్ గా వర్క్ చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి పేరొచ్చింది.