చుడీదార్ లో మెరిసిపోతున్న శ్రీలీలా.. యంగ్ బ్యూటీ కొంటె పోజులకు కుర్రకారు చిత్తే.!

First Published | Feb 20, 2023, 11:14 AM IST

యంగ్ హీరోయిన్  శ్రీలీలా  పేరు టాలీవుడ్ లో ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. భారీ చిత్రాల్లో ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగూ పెరిగిపోతోంది. 
 

మాస్ మహారాజా సరసన ‘ధమాకా’లో నటించి యంగ్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అదే జోష్ ను కంటిన్యూ చేస్తోంది. శ్రీలీలా పేరు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తోంది.  మరోవైపు భారీ చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంటున్నారు. ఇదే సమయంలో యంగ్ బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ నూ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. 
 

ఈ సందర్భంగా నిత్యం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది శ్రీలీలా.. షూటింగ్ బిజీతో ఉన్నా.. సమయం ఉన్పప్పుడల్లా నెట్టింట మెరుస్తూ వస్తున్నారు. ఈ మేరకు అదిరిపోయే అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. మైండ్ బ్లోయింగ్ ఫిట్ నెస్ తో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. యువతకు మత్తెక్కించే పోజులిస్తూ నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా శ్రీలీలా పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 
 


శ్రీలీలా అటు ట్రెండీ వేర్స్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూనే... ఇటు సంప్రదాయ దుస్తుల్లోనూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఈ యంగ్ బ్యూటీ స్టన్నింగ్ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. పైగా ట్రెడిషనల్ లుక్ లో వెలిగిపోతుండటంతో.. తాజాగా తనను పంచుకున్న ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

తాజా పిక్స్ లో స్లీవ్ లెస్ చుడీదార్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు మత్తు కళ్లతో చురకత్తుల్లాంటి చూపులతో యువతను చిత్తు చేస్తోంది. ఇలా నిత్యం గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ ఫాలోయింగ్ నూ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి సోషల్ మీడియాాలో 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మరో హిట్ పడితే ..  ఆ సంఖ్య రెండుమూడింతలు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 
 

ఇదిలా ఉంటే.. శ్రీలీలా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై చాలా ఆసక్తి నెలకొంది. యంగ్ బ్యూటీకి అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించి అవకాశం లభించడం విశేషం. మరోవైపు బాలయ్య చిత్రంలోనూ మెరుస్తుందని తెలుస్తోంది. 

మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’లో హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రొడ్యూసర్ నాగవంశీ కన్ఫమ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బాలయ్య 108వ చిత్రంలోనూ కీలక పాత్రను పోషిస్తున్నట్టుు తెలుస్తోంది. ఈ చిత్రాల తర్వాత శ్రీలీలా క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

Latest Videos

click me!