కృతి-ప్రభాస్ ఎఫైర్ రూమర్స్ కి వరుణ్ ధావన్ ధావన్ కామెంట్స్ కూడా కారణమయ్యాయి.గత ఏడాది విడుదలైన బేడియా మూవీ ప్రమోషన్స్ కోసం కృతి సనన్, వరుణ్ ధావన్ ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో యాంకర్ గా కరణ్ జోహార్ వ్యవహరించారు. కృతిసనన్ పేరు నీ గుండెల్లో ఎందుకు లేదని కరణ్, వరుణ్ ని అడిగారు. ఎందుకంటే... కృతి నేమ్ మరొకరి గుండెల్లో ఉంది. ఆయన ముంబైలో లేడు. మరోచోట దీపికా పదుకొనె తో షూటింగ్ లో చేస్తున్నాడని, వరుణ్ కామెంట్ చేశాడు.