స్లీవ్ లెస్ అందాలతో యంగ్ బ్యూటీ రుహానీ శర్మ రచ్చ.. చిరునవ్వుతో కుర్ర హృదయాలకు గాలం!

First Published | Jan 12, 2023, 11:34 AM IST

‘చిలసౌ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకున్న రుహానీ శర్మ (Ruhani Sharma).. ఇటు సోషల్ మీడియాలోనూ రచ్చ  చేస్తోంది. గ్లామర్ మెరుపులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 
 

నార్త్ బ్యూటీ రుహానీ శర్మ తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపే దక్కించుకుంది. తొలిచిత్రంతో నటనపరంగా ఓకే అనిపించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ గ్లామర్ విందుతో మతులు పోగొడుతోంది. 
 

నెట్టింట తెగ యాక్టివ్ గా ఉంటున్న రుహానీ శర్మ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో రెచ్చిపోతోంది. పొట్టి దుస్తుల్లో మెరుస్తూ అందాల ఆరబోతతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తున్న ఈ బ్యూటీ క్రమంగా ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
 


తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసిందీ బ్యూటీ. స్లీవ్ లెస్ ఎల్లో చుడీదార్ లో గార్డెన్ లో చిలిపిగా ఫొటోలకు ఫోజులిచ్చింది. చిరునవ్వులతో వెలిగిపోయే తన రూపసౌందర్యం నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. మరోవైపు టాప్ గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది.
 

యంగ్ హీరోయిన్ రుహానీకి నెటిజన్ల నుంచీ మంచి మద్దతే లభిస్తోంది.  డాన్స్ వీడియోలతో, రీల్స్ తో అదరగొడుతోంది. తన పోస్టులను ఫాలోవర్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇన్ స్టాలో రుహానీకి 1 మిలియన్ ఫాలోవర్స్ దక్కడం విశేషం. ప్రస్తుతం గ్లామర్ షోతోనూ ఆకట్టుకోవడంతో మరింత ఫాలోవర్స్ ను కూడగట్టుకోనుంది.
 

తెలుగు ప్రేక్షకులకు రుహానీ శర్మ ‘చిలసౌ’ చిత్రంతో పరిచయం అయ్యింది. టాలీవుడ్ లో తన తొలిచిత్రం కూడా ఇదే. అద్భుతమైన నటనతో, అచ్చమైన తెలుగమ్మాయిలా అందాలను ప్రదర్శించి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. తన నటనకు సైమా బెస్ట్ యాక్ట్రెస్ కు నామినేట్ కూడా అయ్యింది.
 

విశ్వక్ సేన్ సరసన ‘హిట్ : ది ఫస్ట్ కేస్’, ఆ తర్వాత ‘డర్టీ హరీ’, నూటొక్క జిల్లాల అందగాడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ గా  ‘మీట్  క్యూట్’తో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. హిందీలో రూపు దిద్దుకుంటున్న‘ఆగ్రా’లో నటిస్తోంది.

Latest Videos

click me!