ముంబైలో కృతి శెట్టి సందడి.. ట్రెండీ అవుట్ ఫిట్ లో అదరగొట్టిన బేబమ్మ.. వైరల్ పిక్స్.!

First Published | Feb 27, 2023, 3:48 PM IST

‘ఉప్పెన’తో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ ను మూటగట్టుకుంటోంది. ఇక తాజాగా ఈబ్యూటీ ముంబైలో మెరిసింది.
 

పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘ఉప్పెన’లో నటించిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తొలిచిత్రంతోనే హిట్ అందుకుంది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన పాత్రకు తగ్గ నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులనే సొంతం చేసుకుంది. 
 

అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ కృతి శెట్టి చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. ఇప్పటికే ఫ్యాన్స్ మీట్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు బయట కూడా తళుక్కున మెరుస్తూ ఫ్యాన్స్  ను సర్ ప్రైజ్ చేస్తోంది. తాజాగా ముంబైలో తన తండ్రితో కలిసి ఓ హోటల్ ను సందర్శించింది.


వైట్ టాప్, బ్లూ జీన్స్ లో కృతి శెట్టి మోడ్రన్ లుక్ అదిరిపోయింది.  ఈసందర్భంగా ఓ మీడియా కంటపడింది. దీంతో ఫ్యాన్స్ కు హాయ్ చెప్పి లోపలికి వెళ్లింది. ఇటీవల సినిమాల్లో కంటే ఇలా బయట ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు కృతి శెట్టి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

ఇక కేరీర్ విషయానికొస్తే.. ఉప్పెన, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగర్రాజు’ చిత్రాలతోనూ బేబమ్మ హిట్ అందుకొని హ్యాట్రిక్ భామగా రికార్డు క్రియేట్ చేసింది. కానీ ప్రస్తుతం కృతి శెట్టికి కాలం కలిసి రావడం లేదు. వరుసగా తను నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగుల్చుతున్నాయి. 

గతేడాది వచ్చిన ‘ది వారియర్’,‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి చిత్రాలు డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో కృతి శెట్టి గ్రాఫ్ పడుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 


ఈ క్రమంలో తదుపరి చిత్రాలతోనైనా బేబమ్మ హిట్ అందుకుంటుందేమో చూడాలనంటున్నారు. అక్కినేని నాగార్జున సరసన కృతి శెట్టి మరోసారి నటిస్తున్న  చిత్రం ‘కస్టడీ’. తాజాగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈచిత్రంపైనే ప్రస్తుతం ఈ బ్యూటీ ఆశలు పెట్టుకుంది. అలాగే తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. 

Latest Videos

click me!