SSMB28 షూటింగ్ లో జాయిన్ కాబోతున్న శ్రీలీలా? కొత్త షెడ్యూల్ డిటేయిల్స్ ఇవే!

First Published | Feb 27, 2023, 2:32 PM IST

యంగ్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) కేరీర్ ప్రస్తుతం జోరు మీద సాగుతోంది. ఈ కుర్రభామ ప్రస్తుతం మహేశ్ బాబు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారిగా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
 

‘పెళ్లిసందడి’తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది యంగ్ హీరోయిన్ శ్రీలీలా. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందీ ముద్దుగుమ్మ. దీంతో ఆఫర్లూ వాటంతటవే వస్తున్నాయి. ఈక్రమంలో భారీ చిత్రాల్లో ఆఫర్లు అందుకుంటోంది.
 

రీసెంట్ గా ‘ధమాకా’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు, మాస్ మహారాజ రవితేజ సరసన నటించే ఛాన్స్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సరిగ్గా వినియోగించుకోంది. తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. 
 


ప్రస్తుతం శ్రీలీలా నటిస్తున్న చిత్రాల్లో భారీ చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రీలీలా మరో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. 
 

తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ న్యూస్ అందింది. ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతోంది. అదికూడా రేపే (ఫిబ్రవరి 27న) మొదలవుతుందని సమాచారం. అయితే ఈకొత్త షెడ్యూల్ లో హీరోహీరోయిన్లకు మధ్య సాగే సన్నివేశాలను చిత్రకరించబోతున్నారంట. సినిమాలోని ప్రధాన తారాగణం కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటికే సిద్ధం చేసిన భారీ సెట్ లో షూటింగ్ జరగనుందని అంటున్నారు.  
 

ఇందుకోసం శ్రీలీలా కూడా సెట్స్ లో జాయిన్ అవుతున్నారంట. తొలిసారిగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన సెట్స్ లో శ్రీలీలా అడుగుపెట్టబోతుండటం ఆసక్తికరంగా మారింది. సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తుందోనని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. మరోవైపు చిత్రంలో శ్రీలీలాకూ మేకర్స్ తగిన ప్రాధాన్యత కల్పిస్తుండటం విశేషం.
 

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే కూడా నటిస్తుండటంతో.. శ్రీలీలాకు అంతగా ప్రాధాన్యత ఉండదేమోనని భావించిన అభిమానులకు భరోసా ఇచ్చారు నిర్మాత నాగవంశీ. ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అంటూ ఉండదు. ఇద్దరి పాత్రలు సినిమాకు చాలా ముఖ్యమైనవిగానే ఉంటాయని గతంలో వివరించారు. దీంతో SSMB28 తర్వాత శ్రీలీలా క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 

Latest Videos

click me!