తెలుగులో రూపొందుతున్న భారీ బడ్జెట్, మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ ల్లో `పుష్ప2` ఒకటి. `పుష్ప`కిది కొనసాగింది. మొదటి భాగం పెద్ద బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. విలన్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటించాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ రూపొందించిన మూవీ ఊహించినవిజయాన్ని సాధించింది. ఇండియన్ ఆడియెన్స్ ని మాత్రమే కాదు, మేకర్స్ ని సర్‌ప్రైజ్ చేసింది.
దీనికి రెండో్ పార్ట్ ని రూపొందిస్తున్నారు సుకుమార్. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్రలో మొదట సుకుమార్ ఎవరిని అనుకున్నారనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే మహేష్‌బాబుతో సుకుమార్ ఓ సినిమా చేయాల్సింది. కానీ అది వర్కౌట్ కాలేదు. అధికారికంగా ప్రకటించి మళ్లీ బ్యాక్ అయ్యారు. ఈ మూవీ కథనే అల్లు అర్జున్‌కి చెప్పాడని, ఆయన చేశాడని, అదే `పుష్ప` అంటున్నారు. కానీ దర్శకుడి వెర్షన్‌లో మాత్రం అది వేరే ఇదే వేరే అంటున్నారు.
ఇదిలా ఉంటే `పుష్ప` కథకి కూడా మహేష్ బాబునే హీరోగా అనుకున్నాడట సుకుమార్. అప్పటికే మహేష్ బాబుతో సినిమా సెట్ కాకపోవడంతో బన్నీకి చెప్పాడట. బన్నీతో ఓ సినిమా చేయాల్సిన కమిట్ మెంట్‌ఉన్న నేపథ్యంలో ఈ కథని చెప్పగా ఆయన ఓకే చేశాడు. అలా `పుష్ప` తెరకెక్కింది. అయితే అల్లు అర్జున్ పాత్రనే కాదు, శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్నా పాత్రకి, నెగటివ్‌రోల్ చేసిన ఫహద్ ఫాజిల్ పాత్రకి కూడా సుకుమార్ వేరే ఆర్టిస్ట్ లను అనుకున్నారట.
శ్రీవల్లి పాత్రకి మొదట సమంతని అనుకున్నాడట సుకుమార్. ఆమెని అప్రోచ్ అయినట్టు సమాచారం. కానీ సామ్ ఆసక్తి చూపించలేదు. దీంతో రష్మిక మందన్నా వద్దకు వెళ్లింది. ఇంకోవైపు మొదట షేకావత్ పాత్రకి విజయ్ సేతుపతిని అనుకున్నాడట సుకుమార్. అది కూడా సెట్ కాలేదు. దీంతో ఫహద్ ఫాజిల్‌ని దించాడట. ఐటెమ్ సాంగ్ కోసం నోరా ఫతేహి ని అనుకున్నారట. ఆమె చేయకపోవడంతో సమంతని తీసుకున్నారని తెలుస్తుంది. మహేష్, సమంత, విజయ్ సేతుపతి చేయాల్సిన ఈ మూవీ బన్నీ, రష్మిక, ఫహద్‌లు చేశారు. బ్లాక్ బస్టర్ కొట్టారు. వీళ్లు తప్ప మరెవ్వరు సెట్ కారు అనేలా చేసి తామేంటో నిరూపించుకున్నారు. ఒకవేళ ఫస్ట్ అనుకున్న కాస్టింగ్‌తో సినిమా చేస్తే ఈ రేంజ్ రీచ్, హైప్ ఉండేదా అనేది డౌట్.
ప్రస్తుతం `పుష్ప2` శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల సినిమాకి హైలైట్ అయితే జాతర ఎపిసోడ్‌ని భారీ స్థాయిలో తెరకెక్కించారట. రాజీపడకుండా సుకుమార్ తీశారని తెలుస్తుంది. మరో షెడ్యూల్ హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరగబోతుందట. కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు. ఆ తర్వాత జపాన్‌లో షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ రెండో పార్ట్ ఎండింగ్‌లో విజయ్ సేతుపతి కనిపించబోతున్నారని తెలుస్తుంది.