Priyanka Singh
జబర్దస్త్ వేదికగా వెలుగులోకి వచ్చింది ప్రియాంక సింగ్. ఈమె అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసేవాడు. చాలా కాలం జబర్దస్త్ కమెడియన్ గా కొనసాగాడు. సాయి తేజ లేడీ గెటప్ లో అచ్చు అమ్మాయి వలె ఉండేవాడు. సడన్ గా ఆమె జబర్దస్త్ కి దూరమైంది.
Maanas
మరలా బిగ్ బాస్ సీజన్ 5లో ప్రత్యక్షం అయ్యింది. సాయి తేజ పేరును ప్రియాంక సింగ్ గా మార్చుకుంది. హౌస్ లో సత్తా చాటిన ప్రియాంక సింగ్ చాలా వారాలు ఉంది. ఆమె కంటెస్టెంట్ మానస్ ని ఇష్టపడటం విశేషం. అతనంటే ప్రత్యేక అభిమానం చూపించేది.
మానస్ మాత్రం ప్రియాంక సింగ్ తో చిన్న లైన్ మైంటైన్ చేసేవాడు. తనతో మాట్లాడేవాడు కానీ... ప్రేమ వరకు వెళ్ళలేదు. ప్రియాంక సింగ్ ఇష్టపడుతున్నప్పటికీ స్నేహితురాలిగానే చూశాడు. ప్రస్తుతం ప్రియాంక సింగ్ బుల్లితెర ఈవెంట్స్ తో పాటు, తన సోషల్ మీడియా అకౌంట్స్ లో సందడి చేస్తుంది.
Priyanka Singh
కాగా ప్రియాంక సింగ్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె చేసిన ఓ పొరపాటు ఇందుకు కారణమైంది. ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రియాంక సింగ్ ఓ టెలివిజన్ షో కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందట. గంటల తరబడి ప్రాక్టీస్ చేయడంతో బాడీ పెయిన్స్ వచ్చాయట. నొప్పులకు పెయిన్ కిల్లర్స్ అతిగా వాడిందట.
Priyanka Singh
ఈ క్రమంలో ఆమె బాడీ డీహైడ్రేషన్ కి గురైందట. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరగా కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని డాక్టర్స్ వెల్లడించారట. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో ప్రియాంక సింగ్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.
Priyanka Singh
నేను చేసిన తప్పు మీరు చేయకండి. వైద్యులు సూచించకుండా ఎలాంటి మెడిసిన్ వాడకండి. అది అత్యంత ప్రమాదకరం అని ప్రియాంక సింగ్ చెప్పారు. చికిత్స అనంతరం ప్రియాంక సింగ్ ఇంటికి వెళ్లారు. దాదాపు పది రోజులు ప్రియాంక సింగ్ ఆసుపత్రిలో ఉందట..