సౌందర్య అసలు డ్రీమ్‌ ఏంటో తెలుసా? సినిమాల కోసం త్యాగం.. బలవంతంగా ఆ పని చేయాల్సి వచ్చిందా?

First Published | Oct 13, 2024, 7:48 AM IST

సౌందర్య తెలుగు ఆడియెన్స్ ఆరాధించే అద్భుతమైన నటి. ఎవర్‌ గ్రీన్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఆమెకి ఇష్టమైన రంగం సినిమా కాదు. ఆమె అసలు డ్రీమ్‌ వేరే ఉంది. 
 

తెలుగు ఎవర్‌ గ్రీన్‌ నటి సౌందర్య. ఒక అద్భుతమైన నటి తెలుగు చిత్ర పరిశ్రమ త్వరగా కోల్పోయింది. కేవలం 12ఏళ్లు మాత్రమే  ఆమె సినిమాల్లో ఉంది. ఆ టైమ్‌లోనే అద్భుతాలు చేసింది. అప్పటి స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. అమితాబ్‌ బచ్చన్‌ నుంచి, చిరంజీవి, బాలయ్య,  నాగ్‌, వెంకీ, జగపతిబాబు, రాజశేఖర్‌, శ్రీకాంత్‌, జేడీ చక్రవర్తి,  రాజేంద్రప్రసాద్‌,  అటు రజనీకాంత్‌, కమల్‌లతోనూ కలిసి నటించింది. అప్పట్లో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌

సౌందర్య నాన్న కే ఎస్‌ సత్యనారాయణ అయ్యార్‌ సినిమాల్లోనే ఉన్నారు. ఆయన నిర్మాతగా,  రైటర్‌గా రాణించారు. దీంతో సౌందర్యకి  సినిమాలంటే చిన్నప్పట్నుంచే తెలుసు. అయితే ఎంత సినిమా రంగంలో ఉన్నా, తాను మాత్రం సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు. ఇంకా చెప్పాలంటే ఆమె బలవంతంగానే సినిమాల్లోకి వచ్చింది. ఓ సినిమాలో పాత్ర కోసం మరో నటి రాకపోవడంతో సౌందర్యని తీసుకున్నారట. చిన్న పాత్రని మరెవరో ఎందుకు మన ఇంట్లోనే అమ్మాయి ఉంది కదా అని, ఆ మూవీ దర్శకుడు చెప్పడంతో సౌందర్యని తీసుకెళ్లి నటింప చేశాడు ఫాదర్‌. 
 

Latest Videos


అదే `గంథర్వ`. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. సౌందర్యకి పెద్ద పేరుని తీసుకురాలేదు. కానీ అందులో ఆమె నటన అందరిని ఆకర్షించింది. ఈజీగా చేసిన తీరుకి ఫిదా అయ్యారు. దీంతో ఇక వరుసగా ఆమెని మేకర్స్ కావాలనుకున్నారు. డిమాండ్‌ పెరిగింది. దీంతో తండ్రి కూడా కాదనలేకపోయాడు. అలా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు వచ్చాయి. చేస్తూనే వెళ్లింది. తెలియకుండానే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. బిజీ అయ్యారు. సౌత్‌ని దున్నేసింది. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆమె దూసుకుపోతుంది. ఎంతో మంది స్టార్‌ హీరోయిన్లని వెనక్కి నెట్టేసి తిరుగులేని స్టార్‌గా ఎదిగింది సౌందర్య. 

అయితే  సౌందర్యకి మొదటి సినిమా బలవంతంగానే సాగింది. ఈ విషయాన్ని ఆమెనే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. `నేను రాను, నాకిష్టం లేదు నాన్న` అని చెప్పినా వినకుండానే ఫాదర్‌ తీసుకెళ్లాడట. నటిని చేశాడు. ఆ తర్వాత ఆమె సూపర్‌ స్టార్‌ అయిపోయింది. అయితే సౌందర్య చిన్నప్పటి డ్రీమ్‌ వేరే ఉంది. ఆమె సినిమాల్లోకి రావాలనుకోలేదు. డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యానని చాలా మంది  చెబుతుంటారు. సౌందర్య విషయంలోనూ అదే జరిగింది. ఆమె డాక్టర్‌ కావాలని కలలు కన్నది. ఆ దిశగానే ఆమె స్టడీస్‌ చేసింది. డాక్టర్‌గా మారి ఎంతో సేవ చేయాలనుకుంది. కానీ విధి మరోటి తలచింది. ఆమె ఇష్టానికి ఫాదర్‌ ప్రయారిటీ ఇచ్చి ఉంటే ఆమెని మనం చూసేవాళ్లం కాదు. ఆమె మన నుంచి దూరమయ్యేది కాదు. హీరోయిన్‌ కాకపోతే ఇలా రాజకీయ ప్రచారంలో పాల్గొనేది కాదు, ఇంతటి దారుణం జరిగేది కాదు. అదే సమయంలో సౌందర్య లాంటి అద్బుతమైన నటిని మనం  మిస్‌ అయ్యేవాళ్లం.  ఏదేమైనా తెలుగు సినిమాల్లో సౌందర్య ఒక వండర్‌. 
 

సౌందర్య.. కన్నడకి చెందిన  నటి అయినా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసింది. తెలుగు నటిగానే గుర్తింపు తెచ్చుకుంది. తన 12ఏళ్ల కెరీర్‌లో 112 సినిమాలు చేసి మెప్పించింది. అందులో మేజర్‌గా తెలుగు సినిమాలే ఉండటం విశేషం. ఇక 2004లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తిరిగి వస్తుండగా, ఆమె హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె భౌతికంగా  లేకపోయినా, సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉంది. ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంది. 

click me!