Janaki Kalaganaledu: జ్ఞానాంబ కాళ్లు పట్టుకున్న జానకి.. రివర్స్ కేసు పెడతాను అంటూ షాక్!

Published : Apr 11, 2022, 11:09 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu ) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Janaki Kalaganaledu: జ్ఞానాంబ కాళ్లు పట్టుకున్న జానకి.. రివర్స్ కేసు పెడతాను అంటూ షాక్!

యోగి ఎవరికీ తెలియకుండా ఆ జ్ఞానాంబ (Jnanamba) మీద కంప్లైంట్ రాసి ఇవ్వు అని జానకిను పోలీస్ స్టేషన్ కి బలవంతంగా తీసుకొని వెళతాడు. ఇక యోగి మీ అత్తయ్య నిన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ఎస్ ఐ గారికి చెప్పు జాను అని జానకితో అంటాడు. ఇక జానకి (Janaki)  మా అత్తయ్య గారు నన్ను చాలా బాధ పెట్టారు అని ఎస్ఐ గారితో చెబుతుంది. 
 

26

దాంతో ఫ్యామిలీ మొత్తం స్టన్ అవుతారు. ఇక అదే క్రమంలో జానకి (Janaki) మా అత్తగారు నన్ను భరించలేనంత ప్రేమతో ఇబ్బంది పెట్టారు అని అంటుంది. దాంతో జ్ఞానాంబ (Jnanamba) మనసు కరిగి పోతుంది. అంతేకాకుండా ఎస్సై గారు మా అన్నయ్య మీకు ఇచ్చిన కంప్లైంట్ లో ఏ మాత్రం నిజం లేదు అని చెబుతుంది. 
 

36

ఇక యోగి (Yogi) నిన్ను కష్టాలనుంచి బయటకు లాగాలని నేను అనుకుంటుంటే నువ్వు ఇంకా ఆ కష్టాలను కొని  తెచ్చుకుంటున్నావు ఏంటి అని అంటాడు. ఆ తర్వాత జానకి (Janaki) మా అత్తగారు నాకు అమ్మా నాన్నల ప్రేమను అందించారని జ్ఞానాంబ కాళ్ల దగ్గర కూర్చుని అంటుంది.
 

46

ఇక జానకి (Janaki) వాళ్ల అత్తయ్య గారి కాళ్ళు కూడా పట్టుకుంటుంది. అంతేకాకుండా మా అత్తయ్య గారి మీద ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకొని మా అత్తయ్య గారికి క్షమాపణలు చెప్పు అని యోగి (Yogi) తో అంటుంది. లేకపోతే మా పరువుకు భంగం కలిగించావని రివర్స్ కేసు పెడతానని అంటుంది.
 

56

ఇక ఆ తర్వాత ఎస్ఐ గారు కంప్లైంట్ చించేస్తారు. మరోవైపు జ్ఞానాంబ (Jnanamba) ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ అవమానాన్ని నేను జీవితంలో మర్చిపోలేను అని అంటుంది. ఆ తర్వాత జానకి (Janaki) దంపతులు జరిగిన దానికి ఒకరికొకరు రియలైజ్ అవుతారు.
 

66

ఆ తర్వాత జానకి (Janaki) అపార్థాలు తొలగి పోయేముందు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని అంటుంది. నన్ను అత్తయ్యగారు అర్థం చేసుకుంటారు అని రామచంద్ర (Rama Chandra) తో అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories