మరోసారి వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రం సింహాద్రి. సింహాద్రి చిత్రంతో ఎన్టీఆర్ టాలీవుడ్ రికార్డులని తిరగరాస్తూ సరికొత్త స్టార్ గా అవతరించాడు. ఇక ఎన్టీఆర్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికి అవి ఎన్టీఆర్ ని అంతగా ఇబ్బంది పెట్టలేదు. యమదొంగ, అదుర్స్, టెంపర్, జనతాగ్యారేజ్, అరవింద సమేత ఇలా వరుస విజయాలతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో జైత్ర యాత్ర కొనసాగించారు.