హరిహర వీరమల్లు చిత్రంలో కూడా హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌తో పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ అంశాలు బీజేపీ అనుకూల ప్రేక్షకులని ఆకర్షించేలా ఉండవచ్చన్న విశ్లేషణ కూడా ఉంది. వారణాసిలో యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో హరిహర వీరమల్లు ఈవెంట్ జరిగితే జాతీయ స్థాయిలో ఈ చిత్రం చర్చనీయాంశం అవుతుంది. అంతే కాకుండా ఉత్తర భారతంలో పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ దక్కే అవకాశం కూడా ఉంటుంది.
ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైంది. కొంత షూటింగ్ జరిగాక క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీత దర్శకుడు.