యష్మికి ఓటేస్తే షో చూడటం మానేస్తా, నెటిజన్లు ఫైర్‌.. ఒక్క దెబ్బకి హీరో అయిపోయిన గౌతమ్‌

First Published | Nov 3, 2024, 8:05 AM IST

యష్మి గౌడ మరోసారి టార్గెట్‌ అయ్యింది. తన ఫేక్‌ గేమ్‌తో దొరికిపోయింది. దీంతో దారుణంగా ట్రోల్స్ కి గురవుతుంది. ఈ క్రమంలో గౌతమ్‌ హీరో కావడం ఆశ్చర్యంగా మారింది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 తొమ్మిది వారం నేటితో ముగుస్తుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు నయని పావని ఎలిమినేట్‌ అవుతుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్‌కి సంబంధించి యష్మి, గౌతమ్‌లు ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ః యష్మికి ఓటేస్తే షో చూడటం మానేస్తా
 

యాష్మిపై నెగటివ్‌ ట్రోల్‌ నడుస్తుంటే, గౌతమ్‌ని హీరోని చేసి ట్రెండ్‌ చేస్తున్నారు. అందుకు కారణం యష్మినే కావడం విశేషం. నామినేషన్‌లో విష్ణు ప్రియాకి తన పాయింట్‌ని ఎక్స్ ప్లెయిన్‌ చేస్తుంటే మధ్యలో జోక్యం చేసుకుని గౌతమ్‌ని టార్గెట్‌ చేసింది యష్మి. అంతేకాదు గట్టిగా వాదించింది. వద్దు అని చెప్పినా వినకుండా వారించింది.

దీంతో గౌతమ్‌ సెటైరికల్‌గా అక్కా అక్కా అంటూ కామెంట్‌ చేశాడు. మొదట తమ్ముడు అన్న యష్మి ఆ తర్వాత అక్కా అనొద్దంటూ ఫైర్‌ అయ్యింది. దీనిపై నాగార్జున వివరణ కోరగా, మాట మార్చేసింది. వీడియో చూపించడంతో దొరికిపోయింది యష్మి. 
 


వీడియోల్లో మూడు సార్లు ఆమె అడ్డంగా బుక్కైపోయింది. గౌతమ్‌ నామినేషన్‌లో మధ్యలో ఇన్‌వాల్వ్ అవడం ఒక కారణమైతే, గౌతమ్‌ అక్కా అనగానే తను తమ్ముడు అన్నది. అంత వరకు ఓకే, కానీ అక్కా అనొద్దని ఫైర్‌ అవడం విచిత్రంగా ఉంది. దీనికితోడు దీనిపై వివరణ ఇస్తూ, క్రష్‌ ఉందని చెప్పి, అక్కా అని పిలవడం బాగాలేదని, పేరుతో పిలవాలని చెప్పింది.

ఆ తాలూకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎలా పిలిచినా సమస్య లేదు. తనకు ఆ ఫీలింగ్‌ లేనప్పుడు దానితో గొడవే లేదు. కానీ యష్మి కావాలని టార్గెట్‌ చేసిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు తన తప్పులు బయటపడటంతో చివరకు ఏడుపు స్టార్ట్ చేస్తుంది యష్మి. 
 

శనివారం ఎపిసోడ్‌లోనూ అదే చేసింది. దీంతో నాగ్‌ వెంటనే పసికట్టి హో.. ఆపు ఆపు అంటూ, నీ తప్పులు బయటపడటంతో ఏడుపుతో సింపతి ట్రై చేస్తుంటావని, ఫ్లిప్‌ గా మారిపోతుంటావని అన్నాడు. దీనికి షాక్‌ అయిన యష్మి, అలా కాదు సార్‌ అని చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో నేను కూడా ఆడియెన్స్ అదే ఫీలింగ్‌లో ఉన్నారని చెప్పి ఆడియెన్‌తో మాట్లాడగా, అతను బోల్డ్  గా చెప్పేశాడు.

తప్పులు చేస్తుంది, ఫేక్‌ గేమ్‌ ఆడుతుందని, తన తప్పు తేలడంతో ఏడస్తుంటుందని, ఆమె గేమ్‌ ఫ్లిప్‌ అంటూ కామెంట్‌ చేశారు. దెబ్బకి యష్మికి దిమ్మతిరిగిపోయింది. ఇలా ప్రతిసారి యష్మి దొరికిపోతుంది. ఆడితేనేమో ఇలా ఫేక్‌ ఆరోపణలు, ఫేక్‌ గేమ్‌తో హైలైట్‌ అవుతుంది, లేదంటే సైలైంట్‌ అయిపోతుంది. ఇదే యష్మికి పెద్ద మైనస్‌గా మారుతుంది. 
 

అయితే యష్మి టార్గెట్‌ చేయడంతో గౌతమ్‌ ఇప్పుడు హీరో అయిపోయాడు. శనివారం ఎపిసోడ్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన ఫ్యాన్స్ ట్రెండ్‌ చేస్తున్నారు. నాగ్‌ కూడా కావాలని వెతికి మరీ తప్పులు తీస్తున్నారని, కావాలని హైలైట్‌ చేస్తున్నారని అంటున్నారు. ఏ తప్పు చేయని వ్యక్తిని కావాలని అందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్ నెట్టింట వైరల్‌ చేస్తున్నారు.

అంతేకాదు గౌతమ్‌ స్ట్రాంగ్‌ అండ్‌ జెన్యూన్‌ అని, తన నిజాయితీ బయటపడుతుందని, స్ట్రాంగ్‌గా ఉండాలని కామెంట్లతో ట్రెండ్‌ చేస్తుండటం విశేషం. అటు యష్మి, ఇటు నాగ్‌, మరోవైపు నిఖిల్‌ ముగ్గురు టార్గెట్‌ చేయగా, అవన్నీ నిజం కాదని తేలడంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు గౌతమ్‌. 
 

ఈ పరిణామాలన్నీ ఇప్పుడు యష్మి మెడ చుట్టూ చుట్టుకుంటున్నాయి. ఆమెని ట్రోల్‌కి గురవుతుంది. ఇలాంటి కంటెస్టెంట్‌ని హౌజ్‌ నుంచి బయటకు పంపించేయాలి, ఇంత చేసినా ఆమెకి ఓటు వేయడం దారుణం అని, త్వరగా హౌజ్‌ నుంచి పంపించడం బెటర్‌ అని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఆమె ఫైనల్‌లోకి వెళితే బిగ్‌ బాస్‌ని చూడటం మానేస్తామంటున్నారు.

అదే విధంగా నిఖిల్‌ విషయంలోనూ అంతే ఆయన విన్నర్‌ అయితే బిగ్‌ బాస్‌ షోని చూడటం వేస్ట్ అంటూ రచ్చ చేస్తున్నారు. మొత్తంగా యష్మి కారణంగా ఇతర కంటెస్టెంట్లు కూడా బలవుతున్నారనే నెటిజన్ల వాదన. మరి ఇప్పటికైనా యష్మి తన తీరు మార్చుకుంటుందా? అనేది చూడాలి. 

Read more: సీఎం అవ్వడమే టార్గెట్‌గా పవన్ పొలిటికల్‌ ఫిల్మ్?, అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేస్తున్న స్టార్‌ డైరెక్టర్‌ ?

Also read: బాలయ్యతో గొడవ, ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఇదే.. దీనికోసమా ఫ్యాన్స్ కొట్టుకునేది?

Latest Videos

click me!