ముఖ్యంగా యష్మీ అయితే సమాధానం చెప్పలేక తల దించుకుంది. ఇక ఇంత మందికి క్లాస్ పడినా.. చివర్లో అంద్భుతంగా ఆడినవారికి గట్టిగానే ప్రశంసలు లభించాయి. విష్ణు ప్రియ విషయంలో ఎప్పటిలాగానే స్పందించని నాగ్.. ఆమెను చిన్నపిల్లలమనస్పత్వంగా భావించి ఏమీ అనకుండా వదిలేస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇక నబిల్ కు కూడా విష్ణు ప్రియ విషయంలో క్లాస్ పడింది. అయినా సరే అతను రియలైజ్అయినట్టు కనిపించలేదు. విష్ణు మీద కోపంగానే ఉన్నట్టు స్పస్టంగాకనిపించింది. ఇక అవినాశ్, రోహిణీ, హరితేజల ఆటతీరు, హౌస్ లో ఉంటున్న విధానం మెచ్చుకుని.. వారిని ఆకాశానికి ఎత్తాడు నాగార్జున.