యష్ విశ్వరూపం.. 20 కేజీలు పెరిగిన కెజిఎఫ్ హీరో.. కారణం ఇదే..

First Published | Sep 12, 2024, 7:05 PM IST

కాస్త లేట్ అయినా.. సాలిడ్ గా రావాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు కెజియఫ్ హీరో యష్ తన విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నాడు. అందుకోసమే భారీ ప్లాన్ కూడా వేశాడు. 
 

కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కన్నడ స్టార్‌ హీరో యష్‌… మరోసారి తన విశ్వరూపం చూపించబోతున్నాడు. కెజియఫ్ తరువాత చాలా కాలం సైలెంట్ గా ఉన్న యష్..

భారీ ప్లాన్ తో రాబోతున్నాడు. ఆయన నుంచి సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. ఎప్పుడెప్పుడు సినిమా అనౌన్స్ చేస్తారా అని ఎదరు చూశారు. దాంతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నాడు యష్. 

అమరావతి లో ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్, చంద్రబాబు, పవన్ చీఫ్ గెస్ట్ లు

యష్ నుంచి  రెండు భారీ ప్రాజెక్ట్ లు రాబోతున్నాయి. అందులో ఒకటి టాక్సిక్ కాగా.. మరోకటి  భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రామాయణ్. అవును ఈ మూవీలో కూడా యష్ ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.

కెజియఫ్ తో ఆయనకు పాన్ఇడియాలో వచ్చిన ఇమేజ్ తో.. ఈమూవీలో అవకాశం సాధించిన యష్.. పాన్ వరల్డ్ పై దృష్టి పెట్టాడు. ఇక రామయాణ్ లో యష్ రావణాసురిడి పాత్రలోన కనిపించబోతన్నారట.

 వెండితెరపై రావణుడి పాత్ర అంటే ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి వారు మన తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వస్తారు. అటువంటి పాత్రను ఇంకెవరు చేయలేదు.. చేసినా అంతగా గుర్తు పెట్టుకోలేదు. అటువంటి పాత్రలో యష్ కనిపించబోతున్నాడు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


అయితే తన కెరీర్ లోనే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఈ పాత్ర అద్భుతంగానిలిచిపోయేలా ప్లాప్ చేస్తున్నారట.  రణబీర్‌ కపూర్‌ రాముడిగా.. సాయిపల్లివి సీతగా.. వీరి కాంబోలో  చిత్రీకరిస్తున్న పాన్‌ ఇండియా మూవీ రామాయణ్‌లో రావణుడిగా కనిపించబోతున్నారు యష్‌.  మూడు పార్ట్‌లుగా వస్తున్న ఈ సినిమాలో సెక్ండ్ పార్ట్ మొత్తం రావణుడి పాత్రపైనే ఉంటుందని చెబుతున్నారు.

పాకిస్తాన్ లో పుట్టిన 5 బాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే...

ఇక రావణుడి పాత్రలో యష్ గుర్తుండిపోయేలా చేయాలని అనుకుంటున్నారు.  రావణాసురిడి విశ్వరూపం చూపించబోతున్నారని టాక్. అందుకే యష్ ఈ పాత్రకోసం గట్టిగా శ్రమిస్తున్నారట. ఓ పద్దతి ప్రకారం తన బాడీని డెవలప్ చేసుకోవడం కష్టపడుతున్నాడు. 

భారీకాయంతో ఫిట్ గా.. చూస్తేనే భయం కలిగేలా కనిపించడానికి శ్రమిస్తున్నారట. ఇందుకోసం యష్ 20 కేజీలు బరువు పెరిగాడట కన్నడ హీరో. సరికొత్త యష్ ను ఈ సినిమాలో చూడబోతున్నట్టు తెలుస్తోంది. 

అంతే కాదు ఈసినిమాలో ఇప్పటి వరకు రావణుడిని చూపించని డిఫరెంట్  యాంగిల్‌ లో ఈ సినిమాలో చూపించబోతున్నని తెలుస్తోంది. అంతే  కాదు రామ... రావణుడి  మధ్య యుద్ధాన్ని కూడా ఇందులో డిఫరెంట్ గా చూపించబోతున్నారట. దాని కోసం  స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారని ఇండస్ట్రీ టాక్‌.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
 

ప్రస్తుతం టాక్సిక్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు యష్. ఈ సినిమా 2025లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రామాయణం పార్ట్ 2 కూడా 2025లో స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు చూడని రావణుడిని ఆన్ స్ర్కీన్ మీద చూడబోతున్నారు. 

ఇక ఈ విషయంలో  యష్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైయిట్ మెంట్‌తో ఉన్నారు. రావణుడి పాత్ర కోసం సుమారు 20 కిలోల బరువు పెరిగిన యష్‌… రావణుడి పాత్ర  కోసం  తీవ్ర కసరత్తులు చేస్తున్న యష్ ఎలా దర్శనం ఇస్తాడో చూడాలి. 

బిగ్ బాస్ లో ఈ రూల్ మారిపోయింది గమనించారా..?

Latest Videos

click me!