బాలకృష్ణ టాలీవుడ్ టాప్ స్టార్స్ ఒకరు. ఆయన పేరిట అనేక రికార్డ్స్ ఉన్నాయి. చకచకా మూవీ పూర్తి చేసి విడుదల చేయడం ఆయనకు అలవాటు. జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తారు. బాలయ్య ఓపెన్ మైండెడ్ కూడాను. మనసులో ఏమనిపిస్తే అది బయటకు చెప్పేస్తాడు. బాలయ్యకు కోపం ఎక్కువే, ప్రేమ కూడా ఎక్కువే.
ఒక స్టార్ హీరోగా బాలయ్య వెంట ఎప్పుడూ సెక్యూరిటీతో పాటు, వ్యక్తిగత విషయాలు చూసుకునే సిబ్బంది ఉంటారు. ఆయన సామాన్లు మోస్తారు. ఒక బ్యాగ్ మాత్రం బాలకృష్ణ ఎవరికీ ఇవ్వరు. స్వయంగా క్యారీ చేస్తారు. ఆ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటీ? అందులో ఏముంటుందనే సందేహం మనకు రావచ్చు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలకృష్ణ ఆ బ్యాగ్ లో మ్యాన్షన్ హౌస్ బాటిల్ క్యారీ చేస్తారట.