Ennenno Janmala Bandham: ఖుషి కన్నతండ్రి యష్ అని పసిగట్టిన వేద.. ఇదంతా అభిమన్యు ప్లాన్ అంటూ ఫైర్!

Published : Apr 12, 2022, 11:54 AM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janamala bandam) సీరియల్ తండ్రీ కూతుర్ల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Ennenno Janmala Bandham: ఖుషి కన్నతండ్రి యష్ అని పసిగట్టిన వేద.. ఇదంతా అభిమన్యు ప్లాన్ అంటూ ఫైర్!

వేద (Vedha) తల స్నానం చేసి అందంగా చీర కట్టుకొని తల జుట్టు డ్రై చేసుకుంటూ నడుము కనిపించే విధంగా ఉంటుంది. దాన్ని యష్ (Yash) అలాగే రొమాంటిక్ గా చూస్తూ ఉండిపోతాడు. ఇక యష్.. నీ జుట్టు నన్ను డిస్టర్బ్ చేస్తుంది కట్ చేసేయ్ అని అంటాడు. అంతే కాకుండా నువ్వు చాలా హాట్ గా ఉన్నావు అని అంటాడు. ఆ తరువాత టీ చాలా హాట్ గా ఉంది అని కవర్ చేస్తాడు.
 

26

ఇక వేద (Vedha) ఈ మధ్యన కొంచెం తేడా గా ఉన్నాడు. నా జాగ్రత్తలో నేను ఉండాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా భోజనం చేస్తూ ఉండగా ఖుషి డాడీ మీ షర్ట్ సూపర్ అని పొగుడుతుంది. దాంతో యష్ (Yash) ఎంతో ఎమోషనల్ అవుతాడు.
 

36

ఇక వేద (Vedha) తండ్రి కూతుర్లు ఇద్దరూ తినే పద్ధతి ఒకేలా ఉంది టేస్ట్ కూడా ఒకేలా ఉంది అని మనసులో అనుకుంటుంది. ఇక ఆ విషయాన్ని వాళ్ల మామయ్యకి కూడా చెబుతుంది. దాంతో వాళ్ళ మామయ్య ఖుషి యష్ కి జిరాక్స్ కాపీ అని అంటాడు. ఇక దాంతో వేద అభిమన్యు (Abhimanyu) రాస్కెల్.. చెప్పడం ఈయన గారు లోపల కుమిలిపోవడం అని అనుకుంటుంది.
 

46

అదే క్రమంలో వేద (Vedha) అభిమన్యు కావాలనే చీకట్లో ఒక బాణం వేసాడు అని అనుకుంటుంది. ఇక ఈ విషయాన్ని యష్ కు ఫ్రూప్ చేయడానికి డిఎన్ఏ టెస్ట్ మాత్రం మార్గం అని అనుకుంటుంది. మరోవైపు అభిమన్యు దంపతులు యష్ (Yash) భాద ఎవరికీ చెప్పుకోలేడు అని ఆనంద పడుతూ ఉంటారు.
 

56

ఇక యష్ (Yash) పదేపదే అభిమన్యు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆఫీసులో తనకు తానే చిరాకు పడుతూ ఉంటాడు. ఇక అది గమనించిన వేద (Vedha) డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అంటుంది. దానితో యష్ దీనంగా చూస్తాడు.
 

66

ఆ తరువాత వేద (Vedha) అభిమన్యు దగ్గరకు వెళ్లి ఖుషి కి తండ్రి యష్ అని నిరూపిస్తాను అని అంటుంది. ఇక అభి అది జరగని పని అంటాడు. జరిగేలా చేస్తా అని వేద అంటుంది అంతే కాకుండా మిస్టర్ లూజర్ అని అభిమన్యు (Abhimanyu) ను వేద అంటుంది.

click me!

Recommended Stories