అప్పారావు జబర్థస్త్ లో కనిపించకపోవడానికి కారణం ఏంటీ..? ఘోరంగా అవమానించారంటూ.. బాధపడిన కమెడియన్

Published : Apr 12, 2022, 11:50 AM IST

జబర్ధస్త్ అప్పారావు అంటే ప్రత్యేకంగా  పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న కమెడియన్ అతను. జబర్థస్త్ లో అంత మంది ఉన్నా.. అప్పారావు మాత్రం స్పెషల్. అటువంటిది అప్పారావు కొంత కాలంగా జబర్ధస్త్ లో ఎందుకు కనిపించడం లేదు. 

PREV
18
అప్పారావు జబర్థస్త్ లో కనిపించకపోవడానికి కారణం ఏంటీ..?  ఘోరంగా అవమానించారంటూ.. బాధపడిన కమెడియన్

అప్పారావు అనే పేరు వింటే ఏ అప్పారావు అంటారేమో కాని..  జబర్దస్త్' అప్పారావు అంటే మాత్రం  అస్సలు పరిచయం చేయాల్సిన అవసరంలేదు.  వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతలా ఆయన జనంలోకి వెళ్లిపోయారు. ఆయనను చూడగానే నవ్వు తన్నుకు వస్తుంది ఆడియన్స్ కు .
 

28

స్పెషల్ మ్యానరిజంతో.. అద్భుతంగా కామెడీ పండిస్తారు అప్పారావు. తన టాలెంట్ టో కామెడీ టైమింగ్ తో జబర్థస్త్ లో తనకంటూ ఓ ఇమేజ్ సాధించాడు అప్పారావు. అంతకు ముందు అప్పారావు ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు .. ఈ కామెడీ షో వలన ఆయనకు వచ్చింది. 

38

అలాంటి పాప్యులర్ షో లో ఈ మధ్య కాలంలో అప్పారావు కనిపించడం లేదు. జబర్థస్త్ స్టేజ్ పై అప్పారావు సందడి చేసి చాలా కాలం అయ్యింది. ఇంతకీ ఆయన ఎందుకు కనిపించడం లేదు. ఏమైపోయాడు. ఇతర కార్యక్రమాల్లో కనిపిస్తున్న అప్పారావు.. జబర్థస్త్ రిలేడెట్ షోస్ లో మాత్రం కనిపించడం లేదు ఎందుకు అని అందరికి డౌట్ వచ్చి ఉంటుంది. 
 

48

ఇక ఈ పరిస్థితిపై తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు అప్పారావు.  ఆయన మాట్లాడుతూ నేను బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఎన్నో స్కిట్లు చేశాను. ఏడెనిమిదేళ్లు నాన్ స్టాప్ గా షూటింగులో పాల్గొంటూ వెళ్లాను. ఎక్కడా కూడా ఎలాంటి రిమార్క్ లేదు. కరోనా కారణంగా నా ఏజ్ ను దృష్టిలో పెట్టుకుని కొంతకాలం వద్దన్నారు. అని చెప్పుకొచ్చాడు అప్పారావు. 
 

58

అయితే ఆ తరువాత కూడా వాళ్లు నన్ను పిలవలేదు .. చెప్పుడు మాటలు విని నా పేరు హోల్డ్ లో పెట్టారు. స్కిట్స్ లో అంతగా  ప్రాధాన్యత లేని పాత్రలు చేయమన్నా చేశాను. అక్కడ నా మర్యాద తగ్గుతున్నట్టునా అనిపించింది. అది అవమానంగా .. బాధగా అనిపించింది అని బాధపడ్డారు అప్పారావు. 

68

ఇన్ని అవమానాలు పడి అక్కడే ఉండటం ఎందుకు అనిపించడంతో జబర్థస్త్ నుంచి తాను  తప్పుకోక తప్పలేదన్నారు అప్పారావు. అంత కాదు ఇక్కడ నుంచి మానేసిన వాళ్ళకు కామెడీ స్టార్స్ లో అవకాశాలు దగ్గకడంతో అంతా కామెడీ స్టార్స్ వైపు వెళ్తున్నారు. అప్పారావు మాట్లాడుతూ.. కామెడీ స్టార్స్ లో డబుల్ పేమెంట్ ఇస్తున్నారు.. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది అని చెప్పుకొచ్చారు. 
 

78

జబర్థస్త్ నుంచి చాలా కాలం నుంచి చాలా మంది సీనియర్ కమెడియన్స్ మాయమయ్యారు. నాగబాబుతో పాటు చమ్మకు చంద్ర,కిరాక్ ఆర్పీలాంటి వారు వెళ్లిపోయారు. రీసెంట్ గా మంత్రిగా మారడంతో రోజా కూడా ఈ షోకి గుడ్ బై చెప్పినట్టే తెలుస్తొంది.
 

88

 దాంతో ఇప్పుడు ఉన్న వాళ్లలో కూడా ఎంత మంది ఉంటారో చెప్పడం కష్టమే అంటున్నారు. ఈమధ్యనే అధిరే అభి కూడా జబర్ధస్త్ నుంచి కామెడీ స్టార్స్ కు చేరిపోయాడు. దాంతో జబర్ధస్ షో రేటింగ్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 
 

click me!

Recommended Stories