ఎపిసోడ్ ప్రారంభంలో అందరూ భార్యలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు కానీ ఒడిలో కూర్చోబెట్టుకుని చూసే మొగుణ్ణి నేనే నేమో అంటూ నవ్వుతాడు యష్. నాకు ఎవరైనా తినిపిస్తే నచ్చదు కానీ మీరు తినిపిస్తే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంటుంది వేద. మరోవైపు నన్ను ఆ వేద చాలా అవమానించింది, యష్ కూడా నా మీద రెచ్చిపోయాడు అని అభికి చెప్తుంది మాళవిక.