Priyanka Chopra: ఓ కుర్రాడు రాత్రివేళ నా  బాల్కనీలోకి వచ్చాడు, అది చూసి నాన్న ఆంక్షలు పెట్టాడు!

Published : May 04, 2023, 11:14 AM ISTUpdated : May 04, 2023, 11:24 AM IST

హీరోయిన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టీనేజ్ లో తనకు ఎదురైన సంఘటన ఆమె గుర్తు చేసుకున్నారు.   

PREV
16
Priyanka Chopra: ఓ కుర్రాడు రాత్రివేళ నా  బాల్కనీలోకి వచ్చాడు, అది చూసి నాన్న ఆంక్షలు పెట్టాడు!
Priyanka Chopra


ప్రియాంక చోప్రా తాజా ఇంటర్వ్యూలో టీనేజ్ లో ఎదురైన ఓ సంఘటన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. 12 ఏళ్ల వయసులో ప్రియాంక చోప్రాను పేరెంట్స్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా పంపారట. అమెరికాలో నాలుగేళ్లు ఉన్న ప్రియాంక తిరిగి ఇండియా వచ్చారట. సుదీర్ఘ కాలం అమెరికాలో ఉండటం వలన ప్రియాంక జీవన శైలి పూర్తిగా మారిపోయిందట. వెస్ట్రన్ స్టైల్ లో డ్రెస్సులు వేసుకునేవారట. 
 

26


ఆమెను పేరెంట్స్ ఓ స్కూల్ లో అడ్మిట్ చేశారట. స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆమెను కుర్రాళ్ళు ఫాలో అయ్యేవారట. రోజూ ఇంటి వరకు వచ్చేవాళ్లట. ఒక రోజు ఓ కుర్రాడు రాత్రివేళ నేరుగా తన బాల్కనీలోకి వచ్చాడట. అతన్ని చూసి భయంతో ప్రియాంక నాన్న వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లిందట. ప్రియాంక నాన్న గది కిటికీలు మూసి వేయించాడట. అలాగే ఆమెకు ఆంక్షలు పెట్టాడట. 

36
Priyanka Chopra


జీన్స్ ధరించవద్దన్నారట. ఒంటరిగా ఎక్కడికీ పంపేవారుకాదట. ఎవరో ఒకరిని తోడుగా పంపేవారట. అప్పుడు నాన్న ఎందుకు అలా చేశారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం అంటూ ప్రియాంక చోప్రా ఎమోషనల్ అయ్యారు. 
 

46
Priyanka Chopra

ప్రియాంక చోప్రా తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా 2013లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన ఇండియన్ ఆర్మీలో ఫిజీషియన్ గా పని చేశారు. కాగా ప్రియాంక చోప్రా లేటెస్ట్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ ఇంగ్లీష్ సిరీస్ ని ప్రియాంక చోప్రా గట్టిగా ప్రోమోట్ చేశారు. ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్. హాలీవుడ్ లో ఆమె వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. 
 

56
Priyanka Chopra

అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ స్ట్రీమ్ అవుతుంది. ప్రియాంక చోప్రా ఈ సిరీస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు ఇబ్బంది పడ్డామని చెప్పారు. సహనటుడు రిచర్డ్ సహకారంతో అలాంటి సన్నివేశాలు పూర్తి చేయగలిగానని ప్రియాంక చెప్పారు.బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల ప్రస్థానం కలిగి ఉన్నారు. టాప్ స్టార్స్ తో జతకట్టిన ఈ స్టార్ లేడీ అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియాంకా చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్నారు. 

66
Priyanka Chopra


ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. నిక్ వయసులో ప్రియాంక కంటే 10 ఏళ్ళు చిన్నవాడు కావడం విశేషం. ఈ విషయంలో ఆమె పలుమార్లు ట్రోల్స్ కి గురయ్యారు. లాస్ ఏంజెల్స్ లో లగ్జరీ హౌస్ కొన్న ప్రియాంక భర్తతో అక్కడే కాపురం పెట్టారు. సరోగసి ద్వారా ప్రియాంక ఓ పాపకు తల్లయ్యారు.
 

click me!

Recommended Stories