ఇక్కడికి అడుగుపెట్టినప్పటి నుంచో లేక పెద్దలు ఆశీర్వాదము పూజ చేసిన ఫలితమో తెలియదు నాకు కొత్తగా ఆలోచనలు వస్తున్నాయి అని అంటాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనుషుల మధ్య ఉన్న బంధాలను ఈరోజు పూజ చేసిన తర్వాత మొదటిసారి నా మనసులో ఏదో అలజడి చెలరేగుతుంది అని అంటాడు. నీ మెడలో నేను కట్టిన తాళి,మన కొంగుముడి,మన సప్తపది. మన మధ్య ఉన్నది కేవలం ఇది మాత్రమే కాదు అంతకుమించి ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అని అంటాడు. అదే పవిత్రమైన వివాహ బంధం, నిజమైన భార్య భర్తలు గా ఒక అన్యోన్య దాంపత్య బాంధవ్యం మనది అనడంతో వేద,యష్ మాటలకు ఆశ్చర్య పోతుంది.