కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.
కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన రెండవ భాగం కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మొత్తం మోగిస్తోంది. కొన్ని చోట్ల కేజిఎఫ్ 2 ఆర్ఆర్ఆర్, బాహుబలి చిత్రాల్ని కూడా అధికమిస్తోంది.
26
KGF2
ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో యష్ ని అల్టిమేట్ ఎలివేషన్ సీన్స్ తో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు. మాస్ ప్రేక్షకులు కేక పెట్టించే విధంగా కేజిఎఫ్ చిత్రం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేజిఎఫ్ 2 సాలిడ్ బాక్సాఫీస్ హిట్ గా దూసుకుపోతోంది. దీనితో యష్ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
36
KGF2
ఒక గ్రామంలో తీవ్రమైన కరువు వస్తుంది. వర్షం కోసం భగవంతుడిని ప్రార్థించేందుకు గ్రామస్తులంతా ఒక చోటికి చేరుతారు. కానీ ఒక చిన్న అబ్బాయి మాత్రం అక్కడికి గొడుగుతో వెళతాడు. ఆ పిల్లాడిని చూసి గ్రామస్తులంతా మూర్ఖుడు అని అంటారు. మరికొందరు అతివిశ్వాసం అని అంటారు.
46
KGF2
కానీ ఆ పిల్లాడిది నమ్మకం మాత్రమే. ఆ పిల్లాడు వర్షం పట్ల ఎలాంటి నమ్మకంతో ఉన్నాడో.. కెజిఎఫ్ చిత్రం విషయంలో కూడా నేను అలాగే ఉన్నాను. ఇది సాధ్యం అవుతుందా అని కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కెజిఎఫ్ చిత్రానికి మీరు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే హృదయం నిండిపోతోంది అని యష్ పేర్కొన్నాడు.
56
KGF2
కేజిఎఫ్ చిత్రంతో యష్ తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. యష్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14న విడుదలయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరు.
66
KGF2
ఈ చిత్రంలో రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలో నటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది.