హీరో యష్ త్వరలో `టాక్సిక్` సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తనని చులకన చేసిన మాట్లాడిన అటు అల్లు అరవింద్, ఇటు రష్మిక మందన్నాలకు ఇచ్చిపడేశారు.
రాక్ స్టార్ యష్.. టాక్సిక్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. `కేజీఎఫ్ 2` తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌తో థియేటర్లోకి వస్తున్నారు యష్. ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. మార్చిలోనే రిలీజ్ కావాల్సింది. యుద్ధ ప్రభావంతో వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ నెల 28న రిలీజ్ కాబోతుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండటం విశేషం.
24
రష్మిక, అల్లు అరవింద్ కామెంట్లపై యష్ రియాక్షన్
ట్రైలర్ ప్రారంభంలో బోల్డ్ గా ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఇటీవల ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అది తలా తోక లేనట్టుగా ఉంది. కథ ఏంటో క్లారిటీ లేదు. యాక్షన్ పార్ట్ ని, రొమాన్స్ ని ఎక్కువగా చూపించారు. అదే సమయంలో సినిమాలోని మెయిన్ ట్విస్ట్ ని రివీల్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు యష్. అందులో భాగంగా ఆయన రష్మిక మందన్నా కామెంట్లకి, అదే సమయంలో అల్లు అరవింద్ కామెంట్లకి స్పందించారు. గతంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇద్దరికి కలిపి ఇచ్చి పడేయడం విశేషం.
34
అల్లు అరవింద్‌కి దిమ్మతిరిగే కౌంటర్
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఒకప్పుడు `కేజీఎఫ్`కి ముందు యష్ ఎవరికీ తెలియదన్నారు. ఈ సినిమా తర్వాతనే అందరికి తెలుసు అని మాట్లాడారు. దీనికి యష్ రియాక్ట్ అవుతూ, `కేజీఎఫ్` తన లైఫ్‌ని మార్చిందనేది నిజమే అని, సినిమా సక్సెస్ కేవలం నిర్మాతది మాత్రమే కాదని, దాని వెనుక సమష్టి కృషి ఉంటుందన్నారు. హీరో సరిగ్గా నటించకపోతే సినిమా హిట్ కాలేదని, ఎవరికి ఎంత క్రెడిట్ ఇవ్వాలో ఆడియెన్స్ కి తెలుసు అని అదిరిపోయే సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగానే రష్మిక మందన్నా 2017లో చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. యష్ షో ఆఫ్(పోజులు కొట్టే వ్యక్తి) పర్సన్ అని రష్మిక గతంలో చెప్పింది. దీనికి యష్ స్పందిస్తూ, ప్రతి ఒక్కరు తమ సొంత ఆలోచనలు కలిగి ఉంటారని, ఆమె ఇంటెన్షన్ ఏంటో తనకు తెలియదని, తను అప్పుడే కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తుందని, ఆమె వ్యక్తిగత అభిప్రాయం తన నిజ స్వభావాన్ని మార్చలేదని చెప్పారు. యష్ అటు అల్లు అరవింద్, ఇటు రష్మిక మందన్నా కామెంట్లకి చాలా హుందాగా రియాక్ట్ అయ్యారు. అదే సమయంలో వాళ్లకి ఇవ్వాల్సిన కౌంటర్ ఇచ్చిపడేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.