ఈరోజు ఎపిసోడ్ లో యష్, వేద, రాజా, రాణి అందరూ కలిసి గుడికి వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి గుడి లోపలికి వెళ్ళగా అప్పుడు రాజా ఈ గుడి మన పూర్వీకులు నిర్మించారు అప్పటి నుంచి ఈ గుడి పెద్దగా మన వంశం వాల్లే ఉంటున్నారు అనడంతో చాలా గొప్ప విషయం తాతయ్య అని అంటాడు యష్. ఇప్పుడు పూజారి ఈ గుడిలో జరిగే పూజలు అన్నీ కూడా ఈ దంపతుల తోనే ఇప్పిస్తూ ఉంటాము చెప్పడంతో వెంటనే రాణి ప్రతి ఏడాది జరిపించే ఈ అన్యోన్య దాంపత్య వ్రతం ఈ ఏడాది మా తరఫున మా మనవరాలు,మనవడు చేస్తున్నారు మాకు అంతకంటే సంతోషం ఏముంది అనడంతో అందరూ కలిసి సంతోషంగా లోపలికి వెళ్తారు.