అప్పుడు మల్లిక ఆ ఇంటిని చూసి ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ అత్తయ్య గారు రెండే గదులు ఉన్నాయి 10 మంది ఎలా సర్దుకుంటాం చెప్పండి. పైగా మామయ్య గారికి ఆరోగ్యం బాగోలేదు. మీరు ఇంట్లోనే సర్దుకోండి నేను మా ఆయన వెళ్లి వేడి రూమ్ లో ఉంటాము అని అంటుంది మల్లిక. అందరూ కలిసే ఉందాం మల్లికా అని జానకి అనడంతో మీరు అత్తయ్య గారు, జెస్సి వాళ్ళు అందరూ ఉండాలి మరి మేము ఎక్కడ ఉండాలి చెప్పు జానకి అని అంటుంది మల్లిక. అప్పుడు మల్లిక మీరేటండి అలాగే చూస్తూ ఉన్నారు. వెళ్దాం పదండి అని వెళుతూ ఉండగా ఆగండి అని అంటుంది జ్ఞానాంబ. విడిపోవడం సులభం కానీ మళ్ళీ కలిసి పోవడం చాలా కష్టం మల్లిక.