ఈరోజు ఎపిసోడ్ లో యష్,వేద ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా అప్పుడు యష్ అవును మీ తాతయ్య వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పావు వారి పేర్లు ఏమిటి అని అడగగా అప్పుడు వేద మా తాత గారి పేరు రాజా అనడంతో మీ నా అమ్మమ్మ పేరు రాణి నా అని అనగా కరెక్ట్ గా గెస్ చేశారు అని అంటుంది వేద. చాలా బాగుంది ఓల్డ్ కపుల్ కి ట్రెండింగ్ నేమ్స్ అని అనడంతో వేద వెటకారమా అని అంటుంది. లేదు నిజం లవ్లీ నేమ్స్ అంటాడు యష్. అవును వారిద్దరూ చాలా మంచివారు ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అమర ప్రేమికులు అని అంటుంది వేద.