టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. నాలుగు రోజుల పండగ వాతావరణాన్ని ఈ సినిమా క్యాష్ చేసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్. ఇక 'KGF' సినిమా చేసి, యష్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ వస్తుండటంతో 'టాక్సిక్'పై అంచనాలు భారీగా పెరిగాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి తారలు నటిస్తున్నారు.