ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పుడు ఎవరి టైమ్ నడుస్తుందో చెప్పడం కష్టం. హీరోలు, హీరోయిన్లు ఎవరైనా సరే వారి టైమ్ నడిచినంత కాలమే.. ఆతరువాత ఆ ప్లేస్ లోకి కొత్త వాళ్లు రావాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ వేవ్ నడిపించిన హీరోలు. తెలుగు పరిశ్రమను నిలబెట్టింది ఈ ఇద్దరు హీరోలే. ఆతరువాత కాలంలో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వచ్చారు.. వీరి వేవ్ కొన్ని సంవత్సరాలు నడిచింది.. ఆతరువాత చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు హీరోలు ఇండస్ట్రీని ఏలారు.. ఇలా ఎవరి టైమ్ లో వారు స్టార్లుగా వెలుగు వెలిగారు.
24
ఎన్టీ రామారావును మించి అడిగిన శోభన్ బాబు
ఈక్రమంలో 1976 లో శోభన్ బాబు హీరోగా మంచి ఫామ్ లోకి వచ్చారు. వరుస సినిమాలు చేస్తున్న టైమ్ లో ఆయనకు డిమాండ్ పెరిగింది. దాంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచారు అందాల నటుడు. ఆఏడాది పొగరుబోతు సినిమా శోభన్ బాబు హీరోగా వచ్చింది. ఈ సినిమా కోసం నిర్మాత శోభన్ బాబును సంప్రదిస్తే.. లక్ష యాబై వేలు రెమ్యునరేషన్ అడిగారట. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటికీ రామారావు లాంటి స్టార్ హీరో లక్ష రూపాయలకు మించి తీసుకోవాడం లేదు. అదే విషయాన్ని నిర్మాతలు శోభన్ బాబుతో చెపితే.. లేదు ఆయన టైమ్ అయిపోయింది.. నాకు వరుస హిట్లు ఉన్నాయి.. నా రెమ్యునరేషన్ ఇంతే అని తేల్చేశారట. అలా హీరోల టైమ్.. ఒక్కోక్కరికి ఒక్కో రకంగా నడుస్తుంది.. అని నిర్మాత అన్నారు. పొగరుబోతు సినిమా శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా తెరకెక్కింది. 1976 సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి.. యావరేజ్ గా నిలిచింది.
34
రెమ్యునరేషన్ల రేంజ్
ఇప్పుడంటే వంద కోట్ల రెమ్యునరేషన్ చాలా కామన్ అయిపోయింది కానీ.. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వారి కాలంలో.. అప్పటి డిమాండ్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఎన్టీఆర్ లక్ష నుంచి లక్షన్నర వరకు తీసుకున్న రోజులు ఉన్నాయి. అదే అప్పుడు భారీ రెమ్యునరేషన్ గా పరిగణించేవారు. ఎన్టీఆర్ హీరోగా రాణిస్తున్న టైమ్ లోనే కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. యంగ్ స్టార్స్ గా వారి సినిమాలు వారు చేసుకుంటూ వెళ్లారు. అప్పుడప్పుడు సీనియర్ హీరోలతో కాంబినేషన్లు కూడా చేశారు. అయితే రామారావు, నాగేశ్వరావు ను మించి మాత్రం వీరికి రెమ్యునరేషన్లు ఉండేవి కావు. కానీ కాలం సాగుతున్నా కొద్ది పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. శోభన్ బాబు, కృష్ణ సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సీనియర్లు అయిపోయారు.
నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ.." ఎన్టీఆర్, ఏఎన్నార్ ల ఆలోచన వేరు.. నిర్మాత నష్టపోకూడదు అని వారు ఆలోచించేవారు. కానీ శోభన్ బాబు మాత్రం రెమ్యునరేషన్ విషయంలో చాలా కఠినంగానే ఉండేవారు. ఇక శోభన్ బాబుతో పాటు అదే జనరేషన్ హీరో కృష్ణ మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించేవారు. నిర్మాతలు నష్టపోకూడదు అని ఆయన కూడా అనుకునేవారు. కృష్ణ గారు నిర్మాత మంచి గురించి ఆలోచిస్తారు.. లక్ష రూపాయలు ఇస్తాము అంటే.. లేదులే ప్రసాదు 75 వేలు ఇవ్వు చాలు అనేవారు. హీరోల మధ్య జనరేషన గ్యాప్ లో... చాలామార్పులు వచ్చాయి.. రెమ్యునరేషన్ విషయంలో కూడా మార్పులు చూశాము'' అని నిర్మాత ప్రసాద్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిర్మాతల విషయంలో హీరో కృష్ణకు మంచి పేరుంది. నిర్మాతలు డబ్బులు ఇవ్వకపోయినా..పెద్దగా పట్టించుకునేవారు కాదట. తన సినిమా వల్ల నిర్మాత నష్టపోతే.. వెంటనే మరోసినిమాకు డేట్స్ ఇచ్చి.. ఫైనాన్స్ కు షూరిటీ కూడా ఇచ్చేవారట సూపర్ స్టార్.